Nidhan
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇంతకంటే వరస్ట్ ఇంకొకటి లేదు.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇంతకంటే వరస్ట్ ఇంకొకటి లేదు.
Nidhan
ఇప్పుడు మొత్తం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడుతుండటంతో ఇంటర్నేషనల్ క్రికెట్ స్తంభించిపోయింది. మెగా లీగ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఆదరణతో పాటు కాసులు కూడా భారీ మొత్తంలో అందుతుండటంతో అందరు ఆటగాళ్లు ఇక్కడే బిజీ అయిపోయారు. అయితే ఈ టైమ్‌లో పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. కివీస్ బీ టీమ్‌తో కలసి పాక్ ఆడుతున్న ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో పాక్ ఓడింది. టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా ఆర్మీ ట్రైనింగ్ పేరుతో కొండలు, గుట్టలు ఎక్కిన పాక్ ప్లేయర్లు గొప్పలకు పోయారు. తమ ట్రైనింగ్ పవర్ ప్రపంచ కప్‌లో చూపిస్తామన్నారు. కానీ న్యూజిలాండ్ బీ టీమ్ మీదే ఓడిపోయిన దాయాది జట్టు ఉన్న కాసింత పరువు కూడా పోగొట్టుకుంది.
కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, ప్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్ లాంటి టాప్ కివీస్ ప్లేయర్లు ఐపీఎల్లో బిజీగా ఉన్నారు. దీంతో పాక్ టూర్‌కు న్యూజిలాండ్ బీ టీమ్ వెళ్లింది. అయితే ఆ జట్టుతో కూడా బాబర్ సేన ఓడిపోవడంతో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీళ్లను ఓడించడం కూడా మీకు చేతగాదు.. ఇంకా వరల్డ్ కప్ ఏం నెగ్గుతారంటూ సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ నడుస్తోంది. పాక్ టీమ్‌లో స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా క్రిటిసిజమ్ బారిన పడ్డాడు. దానికి కారణం అతడి చెత్తాటే. రెండో మ్యాచ్‌లో బాగా ఆడిన రిజ్వాన్ మూడో టీ20లో ఫెయిలయ్యాడు. ఈ మ్యాచ్‌తో 3 వేల పరుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడతను.
టీ20 క్రికెట్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న రిజ్వాన్‌కు అందుకోసం ఏకంగా 2,349 బంతులు తీసుకోవడం గమనార్హం. మూడు వేల పరుగుల మార్క్‌ను చేరుకునేందుకు ఎక్కువ బంతులు తీసుకున్న క్రికెటర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడీ పాక్ స్టార్. దీంతో నెట్టింట అతడ్ని భారీగా ట్రోల్ చేస్తున్నారు. టీ20లను టెస్టులుగా ఎలా ఆడాలో రిజ్వానే ఎగ్జాంపుల్ అని.. వెళ్లి వన్డేలు, లాంగ్ ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడుకుపో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి ఫార్మాట్లో ఇంత కంటే వరస్ట్ రికార్డ్ మరొకటి ఉండదని అంటున్నారు. ఇలాంటి ప్లేయర్లు ఉన్న టీమ్‌తో వరల్డ్ కప్ గెలవడం పక్కనబెడితే.. కనీసం గ్రూప్ దశను కూడా దాటలేరని చెబుతున్నారు. న్యూజిలాండ్ బీ టీమ్ మీదే నెగ్గనివారు.. మెయిన్ టీమ్ ఎదురొస్తే పారిపోతారేమోనని ఎగతాళి చేస్తున్నారు. మరి.. రిజ్వాన్ రికార్డుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Most balls taken to complete 3,000 T20i runs:
Mohammad Rizwan – 2,349.
– The Bradman of T20 Cricket!! pic.twitter.com/wMz7L5E6CF
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 23, 2024