iDreamPost

సన్​రైజర్స్ టీమ్​లో అతడే నా ఫేవరెట్.. సూపర్​స్టార్ మహేష్ కామెంట్స్!

  • Published Apr 23, 2024 | 3:09 PMUpdated Apr 23, 2024 | 3:09 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి సూపర్​స్టార్ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆరెంజ్ ఆర్మీలో ఆ ప్లేయరే తన ఫేవరెట్ అని అన్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి సూపర్​స్టార్ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆరెంజ్ ఆర్మీలో ఆ ప్లేయరే తన ఫేవరెట్ అని అన్నారు.

  • Published Apr 23, 2024 | 3:09 PMUpdated Apr 23, 2024 | 3:09 PM
సన్​రైజర్స్ టీమ్​లో అతడే నా ఫేవరెట్.. సూపర్​స్టార్ మహేష్ కామెంట్స్!

సన్​రైజర్స్ హైదరాబాద్.. ఈ పేరు వింటేనే ఐపీఎల్​లో అన్ని జట్లు వణుకుతున్నాయి. ఆ టీమ్​తో మ్యాచ్ వద్దురా బాబు అంటూ మొత్తుకుంటున్నాయి. దీనికి ఆరెంజ్ ఆర్మీ ఆటతీరే కారణం. విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఎస్​ఆర్​హెచ్. నయా అటాకింగ్ స్టైల్​తో టీ20 క్రికెట్​కు సరికొత్త నిర్వచనం చెబుతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఫస్టాఫ్​లోనే 250 ప్లస్ స్కోర్లు మూడు సార్లు బాదేసింది. బ్యాటింగే కాదు.. బౌలింగ్​లోనూ చెలరేగుతూ అపోజిషన్ టీమ్స్​ను భయపెడుతోంది. దీంతో కమిన్స్ సేనతో మ్యాచ్​ అంటే ముంబై, సీఎస్​కే లాంటి టాప్ టీమ్స్ సహా మిగతా జట్లు కూడా వెనకడుగు వేస్తున్నాయి. అలాంటి ఆరెంజ్ ఆర్మీ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ మహేష్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

వరుస విజయాలతో కమిన్స్ సేన దూకుడు మీద ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి.. ఇలా ఒక్కొక్కరూ తమ బ్యాట్లతో పరుగుల సునామీ సృష్టిస్తున్నారు. ఇప్పటికే టాప్ టీమ్స్​ను చిత్తుగా ఓడించిన సన్​రైజర్స్ నెక్స్ట్ ఆర్సీబీతో సొంతగడ్డపై మ్యాచ్​కు రెడీ అయిపోయింది. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు సిద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీ సోమవారం సూపర్​స్టార్ మహేష్ బాబును కలిసింది. ఈ సందర్భంగా మహేష్​తో దిగిన ఫొటోను ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్. టాలీవుడ్ ప్రిన్స్​తో సరదాగా కాసేపు గడిపాం అని ఆ పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి మహేష్ రిప్లయ్ ఇచ్చాడు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నాడు.

Maheshbabu

కమిన్స్​ను కలవడం సంతోషంగా, గౌరవంగా ఉందన్నాడు మహేష్. అతడికి తాను బిగ్ ఫ్యాన్​నని చెప్పాడు. సన్​రైజర్స్​ ఆటగాళ్లందరికీ బెస్ట్ విషెస్ అని సూపర్​స్టార్ తన ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​లో రాసుకొచ్చాడు. ఎస్​ఆర్​హెచ్​లో కమిన్స్ గేమ్ తనకు బాగా ఇష్టం అని పేర్కొన్నాడు. కాగా, మహేష్​ను కలసిన వారిలో కమిన్స్​తో పాటు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ తదితరులు ఉన్నారు. ఇందులో బ్లాక్ కలర్ హుడీలో దర్శనమిచ్చారు సూపర్​స్టార్. రాజమౌళి మూవీ కోసం సిద్ధమవుతున్న ఆయన లాంగ్ హెయిర్​లో చాలా స్టైలిష్​గా కనిపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు, పోస్ట్​ను చూసిన నెటిజన్స్ మహేష్ లుక్ సూపర్బ్ అని అంటున్నారు. మరి.. కమిన్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి