Nidhan
PAK vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది పాకిస్థాన్. ఈ మధ్య చెత్తాటతో నిరాశపరుస్తున్న ఆ టీమ్.. ఈ సిరీస్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పాక్ కెప్టెన్ మసూద్ రియాక్ట్ అయ్యాడు.
PAK vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది పాకిస్థాన్. ఈ మధ్య చెత్తాటతో నిరాశపరుస్తున్న ఆ టీమ్.. ఈ సిరీస్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పాక్ కెప్టెన్ మసూద్ రియాక్ట్ అయ్యాడు.
Nidhan
పాకిస్థాన్.. క్రికెట్లో ఒకప్పడు డేంజరస్ టీమ్‌గా హవా నడిపించింది. ఐసీసీ ట్రోఫీల సంగతి పక్కనబెడితే.. ఆ జట్టు ఆటతీరు చాలా బాగుండేది. పేస్ బౌలింగ్ బలంతో ఏళ్ల పాటు అన్ని టీమ్స్‌ను వణికించింది పాక్. క్వాలిటీ బ్యాటర్లు, హార్డ్ హిట్టర్లు కూడా ఉండటంతో ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు అలర్ట్ అయ్యేవారు. బెస్ట్ ఇస్తే తప్ప గెలవలేమని భావించేవారు. అయితే ఇప్పుడు పాక్ పరిస్థితి దిగజారింది. వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ దాటలేక తీవ్ర విమర్శలపాలైంది దాయాది టీమ్. బ్యాటింగ్, బౌలింగ్ బలహీనతతో ఇబ్బంది పడుతున్న ఆ టీమ్ పనైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్న పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నెగ్గి సత్తా చాటాలని చూస్తోంది.
వరుస ఓటములతో సొంత అభిమానుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్.. రేపటి నుంచి జరగబోయే బంగ్లా సిరీస్‌లో విజేతగా నిలవాలని చూస్తోంది. సక్సెస్ బాట పట్టి అవమానాలకు తెరదించాలని చూస్తోంది. బంగ్లా సిరీసే దీనికి ఆరంభంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మీదట కొత్త బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామని తెలిపాడు. తమ ఆటతీరులో మార్పును అందరూ గమనిస్తారని అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2025 ఫైనల్ బెర్త్ లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పాడు. తప్పకుండా ఫైనల్లో ఆడతామన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ అని.. అగ్రెసివ్ అప్రోచ్‌తో ఆడితేనే ఇది సాధ్యమన్నాడు. వికెట్లు తీయడంలో ఎంత ముందుంటే అంత మంచిదన్నాడు మసూద్.
అపోజిషన్ టీమ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేస్తేనే టెస్టుల్లో విజయాలు దక్కుతాయని మసూద్ పేర్కొన్నాడు. ‘మేం కొత్త బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాం. అపోజిషన్ టీమ్ 20 వికెట్లు తీస్తే మ్యాచ్‌లు గెలవొచ్చు. కన్సిస్టెంట్గా ఇది చేస్తూ పోతే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడొచ్చు. ఆటగాళ్లందరూ ఫుల్ ఫ్రీడమ్‌తో ఆడాలి. అందుకు అనుగుణంగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంలో మార్పు తీసుకొస్తున్నాం. ప్లేయర్లు బాగా ఆడితే ఫ్యాన్స్ సంతోషిస్తారు. విజయమైనా, అపజయమైనా డ్రెస్సింగ్ రూమ్ నుంచే మొదలవుతుందని నమ్ముతా. ఎందుకంటే ఆటగాళ్లు ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే. డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఫీల్డ్‌లో కూడా అదే జోష్ కనిపిస్తుంది. అందుకే తొలుత దీనిపై ఫోకస్ చేశాం’ అని మసూద్ చెప్పుకొచ్చాడు. మరి.. పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
My question to Shan Masood: Pakistan finished 6th and 7th in the last two WTC cycles. What different would you want to do as captain this time?
Shan’s reply: We have to play a brand of cricket which we enjoy and take 20 opposition wickets consistently to play the WTC final this… pic.twitter.com/RELeWmnTqH
— Farid Khan (@_FaridKhan) August 20, 2024