iDreamPost
android-app
ios-app

Shan Masood: కొత్త బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడతాం.. పాక్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 20, 2024 | 8:06 PM Updated Updated Aug 20, 2024 | 8:06 PM

PAK vs BAN: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సన్నద్ధమవుతోంది పాకిస్థాన్. ఈ మధ్య చెత్తాటతో నిరాశపరుస్తున్న ఆ టీమ్.. ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పాక్ కెప్టెన్ మసూద్ రియాక్ట్ అయ్యాడు.

PAK vs BAN: బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​కు సన్నద్ధమవుతోంది పాకిస్థాన్. ఈ మధ్య చెత్తాటతో నిరాశపరుస్తున్న ఆ టీమ్.. ఈ సిరీస్​లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పాక్ కెప్టెన్ మసూద్ రియాక్ట్ అయ్యాడు.

  • Published Aug 20, 2024 | 8:06 PMUpdated Aug 20, 2024 | 8:06 PM
Shan Masood: కొత్త బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడతాం.. పాక్‌ కెప్టెన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పాకిస్థాన్.. క్రికెట్​లో ఒకప్పడు డేంజరస్​ టీమ్​గా హవా నడిపించింది. ఐసీసీ ట్రోఫీల సంగతి పక్కనబెడితే.. ఆ జట్టు ఆటతీరు చాలా బాగుండేది. పేస్ బౌలింగ్ బలంతో ఏళ్ల పాటు అన్ని టీమ్స్​ను వణికించింది పాక్. క్వాలిటీ బ్యాటర్లు, హార్డ్ హిట్టర్లు కూడా ఉండటంతో ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు అలర్ట్ అయ్యేవారు. బెస్ట్ ఇస్తే తప్ప గెలవలేమని భావించేవారు. అయితే ఇప్పుడు పాక్ పరిస్థితి దిగజారింది. వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్​లో గ్రూప్ దశ దాటలేక తీవ్ర విమర్శలపాలైంది దాయాది టీమ్. బ్యాటింగ్, బౌలింగ్​ బలహీనతతో ఇబ్బంది పడుతున్న ఆ టీమ్ పనైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్న పాకిస్థాన్.. బంగ్లాదేశ్​తో సిరీస్​లో నెగ్గి సత్తా చాటాలని చూస్తోంది.

వరుస ఓటములతో సొంత అభిమానుల నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్.. రేపటి నుంచి జరగబోయే బంగ్లా సిరీస్​లో విజేతగా నిలవాలని చూస్తోంది. సక్సెస్ బాట పట్టి అవమానాలకు తెరదించాలని చూస్తోంది. బంగ్లా సిరీసే దీనికి ఆరంభంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మీదట కొత్త బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతామని తెలిపాడు. తమ ఆటతీరులో మార్పును అందరూ గమనిస్తారని అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్-2025 ఫైనల్​ బెర్త్ లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పాడు. తప్పకుండా ఫైనల్​లో ఆడతామన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్​కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్​ ఇంపార్టెంట్ అని.. అగ్రెసివ్ అప్రోచ్​తో ఆడితేనే ఇది సాధ్యమన్నాడు. వికెట్లు తీయడంలో ఎంత ముందుంటే అంత మంచిదన్నాడు మసూద్.

అపోజిషన్ టీమ్​ను రెండుసార్లు ఆలౌట్ చేస్తేనే టెస్టుల్లో విజయాలు దక్కుతాయని మసూద్ పేర్కొన్నాడు. ‘మేం కొత్త బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాం. అపోజిషన్ టీమ్​ 20 వికెట్లు తీస్తే మ్యాచ్​లు గెలవొచ్చు. కన్​సిస్టెంట్​గా ఇది చేస్తూ పోతే డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆడొచ్చు. ఆటగాళ్లందరూ ఫుల్ ఫ్రీడమ్​తో ఆడాలి. అందుకు అనుగుణంగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంలో మార్పు తీసుకొస్తున్నాం. ప్లేయర్లు బాగా ఆడితే ఫ్యాన్స్ సంతోషిస్తారు. విజయమైనా, అపజయమైనా డ్రెస్సింగ్ రూమ్ నుంచే మొదలవుతుందని నమ్ముతా. ఎందుకంటే ఆటగాళ్లు ఎక్కువ సమయం గడిపేది ఇక్కడే. డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్​మెంట్ బాగుంటే ఫీల్డ్​లో కూడా అదే జోష్ కనిపిస్తుంది. అందుకే తొలుత దీనిపై ఫోకస్ చేశాం’ అని మసూద్ చెప్పుకొచ్చాడు. మరి.. పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.