iDreamPost
android-app
ios-app

వీడియో: పరుపులేసుకుని పాక్ ఆటగాళ్ల క్యాచ్ ప్రాక్టీస్.. వీళ్లు మారరు!

Pakistan fielding practice: ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో పాక్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసింది. పసికూన అయినా అమెరికా చేతిలో ఓటమి చవి చూసి.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. తాజాగా వాళ్లు చేసిన ఓ పని నవ్వులు పువ్వులు పూయించింది.

Pakistan fielding practice: ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో పాక్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసింది. పసికూన అయినా అమెరికా చేతిలో ఓటమి చవి చూసి.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. తాజాగా వాళ్లు చేసిన ఓ పని నవ్వులు పువ్వులు పూయించింది.

వీడియో: పరుపులేసుకుని పాక్ ఆటగాళ్ల క్యాచ్ ప్రాక్టీస్.. వీళ్లు మారరు!

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఏది చేసిన చాలా ఫన్నీగా ఉంటుంది. గతంలో వారు క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఆర్మీ తరహాలో ట్రైనింగ్ తీసుకున్నసంగతి తెలిసింది. ఆ సమయంలో వారు చేసిన కొన్ని కొన్ని ట్రైనింగ్ యాక్టీవిస్ అందరికి నవ్వులు తెప్పించాయి. అంతేకాక పాక్ ప్లేయర్స్ బెటర్ అనుకున్న ప్రతిసారీ…ఇంకాస్తా దిగజారి పోతున్నారు. తాజాగా క్యాచ్ ల ప్రాక్టీస్ కోసం వారు అనుసరించిన విధానానికి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు మారరా అంటూ పలువురు నెటినజ్లు పాక్ ప్లేయర్లపై కామెంట్స్ చేస్తున్నారు.  ఇంతకీ వారు చేసిన పని ఏమిటో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచ కప్ లో పాక్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసింది. పసికూన అయినా అమెరికా చేతిలో ఓటమి చవి చూసి.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. గతంలో తాము ఏదో ఆర్మీ మాదిరిగా ప్రాక్టీస్ చేసి..విరగదీస్తామన్నట్లు పాక్ ప్లేయర్ల ప్రవర్తన కనిపించింది. అయితే ప్రపంచకప్ ప్రారంభమైన తరువాత అట్టర్ ప్లాప్ ప్రదర్శనతో ఇంటిముఖంపట్టారు. ఇంతజరిగిన పాక్ ఆటగాళ్లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఎంత వరస్ట్ ప్లేయర్లు కాకుంటే.. గ్రౌండ్ లో పరుపులేసుకొని వాటిపై క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తారు. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న చిన్న చిన్న దేశాలకు చెందిన క్రికెటర్లు సైతం ఇలాంటి పని చేయరని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాక్ ప్లేయర్లు చేస్తున్న క్యాచ్, ఫీల్డింగ్ వంటి విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్  అయ్యాయి.

అమెరికాలో జరిగిన టి-20 ప్రపంచ‌క‌ప్‌లో దారుణమైన ప్రదర్శన తరువాత పాక్ క్రికెట్ టీమ్ స్వదేశానికి చేరుకుంది. ఈ క్రమంలోనే బాబ‌ర్ బృందం వారం రోజుల విశ్రాంతి తీసుకుంది. అనంతరం తాజాగా లాహోర్‌లోని గ‌డ్డాఫీ స్టేడియంలోని ప్రాక్టీస్ సెష‌న్స్‌లో పాల్గొంది. అక్కడ కొందరు ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్‌ లను ప్రాక్టిస్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు క్యాచ్ లను  ప్రాక్టీస్ చేశారు. వీళ్ల ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

పాక్ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హ‌క్‌తో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు గ్రౌండ్ లో పరుపులను ఏర్పాటు చేసుకుని క్యాచ్ లు ప్రాక్టీస్ చేయడం ఓ వీడియోలో కనిపిస్తుంది. ఇటీవలే ఇండియన ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ బౌండరీ లైన్ క్యాచ్ పట్టినట్లు అద్భుతమైన క్యాచ్ అందుకున్న వీరుల్లా డైవ్ చేస్తూ పరుపులపై దూకుతున్నారు. పాక్ క్రికెటర్ల ఫీల్డింగ్ విన్యాసాల వీడియోలు నెట్టింట కనిపించగానే.. చాలా మంది దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.