iDreamPost
android-app
ios-app

Shan Masood: మా టీమ్​లో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. కానీ! పాక్ కెప్టెన్ మసూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 12, 2024 | 8:29 PM Updated Updated Aug 12, 2024 | 10:11 PM

పాకిస్థాన్ జట్టు మరో సవాల్​కు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్ కప్​లో చిత్తుగా ఓడి విమర్శలపాలైన ఆ టీమ్.. ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ ఛాలెంజ్​కు రెడీ అవుతోంది.

పాకిస్థాన్ జట్టు మరో సవాల్​కు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్ కప్​లో చిత్తుగా ఓడి విమర్శలపాలైన ఆ టీమ్.. ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ ఛాలెంజ్​కు రెడీ అవుతోంది.

  • Published Aug 12, 2024 | 8:29 PMUpdated Aug 12, 2024 | 10:11 PM
Shan Masood: మా టీమ్​లో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. కానీ! పాక్ కెప్టెన్ మసూద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పాకిస్థాన్ జట్టు మరో సవాల్​కు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్ కప్​లో చిత్తుగా ఓడి విమర్శలపాలైన ఆ టీమ్.. ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ ఛాలెంజ్​కు రెడీ అవుతోంది. బంగ్లాదేశ్​తో తలపడనుంది దాయాది జట్టు. ఆగస్టు 21న జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్​కు తెరలేవనుంది. ఈ సిరీస్​ కోసం పాక్ ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. ఏడాది గ్యాప్​లో వన్డే వరల్డ్ కప్-2023, టీ20 ప్రపంచ కప్​-2024లో చెత్తాటతో గ్రూప్ దశ నుంచే వైదొలగడంతో పాకిస్థాన్​ జట్టు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఆటగాళ్ల మధ్య గొడవలు, గ్రూపులు కట్టడం, కోచింగ్, సెలెక్షన్ బృందాన్ని మార్చినా ఫలితం లేకపోవడంతో ఆ టీమ్​పై అందరూ ఆశలు వదులుకున్నారు. ఈ తరుణంలో మంచి విజయంతో తిరిగి సత్తా చాటాలని పాక్ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.

బంగ్లాదేశ్​ను చిత్తు చేసి తమ కమ్​బ్యాక్​ను ఘనంగా చాటాలని పాకిస్థాన్ భావిస్తోంది. అందుకే ఆ టీమ్ ప్లేయర్లు ప్రాక్టీస్​లో మునిగిపోయారు. ఈ సిరీస్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్లేయర్ల నెట్ సెషన్​ను ముందే స్టార్ట్ చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్లేయర్లు తమ బెస్ట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. టీమ్​కు సంబంధించిన మిగిలిన వ్యవహారాలు కూడా టైమ్​కు జరిగేలా చూస్తోంది.​ ఇందులో భాగంగా తాజాగా పాక్ టెస్ట్ టీమ్ కెప్టెన్ షాన్ మసూద్​తో ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే మసూద్​కు ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. జట్టులో ఎవరైనా ఫిక్సర్లు ఉన్నారా? అనే ప్రశ్న అడగగా.. అలాంటి వాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశాడు. ఆటగాళ్లంతా నిబద్ధతతో ఆడుతున్నారని చెప్పాడు.

‘మా టీమ్​లో ఫిక్సర్లు ఎవరూ లేరు. ప్లేయర్లు అంతా నిబద్ధతతో ఆడుతున్నారు. ఫిక్సింగ్ లాంటి వాటికి ఇక్కడ చోటు లేదు. కానీ మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం సరికాదు. ఒక ఫార్మాట్​తో ఇంకో ఫార్మాట్​ను మిక్స్ చేసి క్వశ్చన్స్ అడగొద్దు. మేం మా స్టైల్​ క్రికెట్ ఆడతాం. హోమ్ సిరీస్ రూపంలో మంచి ఛాన్స్ మా ముందు ఉంది. టీమ్​ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’ అని మసూద్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచ కప్​లో పాక్ విఫలమవడంతో టీమ్​లో కొందరు ఫిక్సర్లు ఉన్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మసూద్​కు అలాంటి ప్రశ్న ఎదురైంది. ఫిక్సర్లు లేరని క్లారిటీ ఇచ్చాడు. టెస్టుల వరకు ఏదైనా అడిగితే ఓకే.. కానీ ఇంకో ఫార్మాట్​ను కలిపి ప్రశ్నలు అడగడం, అయిపోయిన టోర్నీ గురించి, ఆటగాళ్ల నిబద్ధతతను గురించి సవాల్ చేసేలా క్వశ్చన్స్ అడగడం ఏంటని సీరియస్ అయ్యాడు మసూద్.