iDreamPost
android-app
ios-app

T20 World Cup: గ్రూప్‌ స్టేజ్‌లోనే పాక్‌, ఇంగ్లండ్‌ ఇంటికి? 2022 ఫైనలిస్టులకు ఘోర అవమానం

  • Published Jun 10, 2024 | 1:38 PM Updated Updated Jun 10, 2024 | 1:38 PM

Pakistan, England, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఫైనల్‌ ఆడిన టీమ్స్‌ పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌.. ఈ వరల్డ్‌కప్‌లో మాత్రం గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాట పట్టేలా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Pakistan, England, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఫైనల్‌ ఆడిన టీమ్స్‌ పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌.. ఈ వరల్డ్‌కప్‌లో మాత్రం గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాట పట్టేలా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 10, 2024 | 1:38 PMUpdated Jun 10, 2024 | 1:38 PM
T20 World Cup: గ్రూప్‌ స్టేజ్‌లోనే పాక్‌, ఇంగ్లండ్‌ ఇంటికి? 2022 ఫైనలిస్టులకు ఘోర అవమానం

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఊహించని పరిణామాలు జరిగేలా కనిపిస్తోంది. పసికూన జట్లు పెద్ద పులుల్లా అందరి అంచనాలను తలకిందుకు చేస్తూ.. విరుచుకుపడుతుండటంతో.. అసలు ఏ టీమ్‌ సూపర్‌ 8కి చేరుకుంటుంటుంది, ఏ టీమ్‌ ఇంటికి వెళ్తుంది చెప్పలేని పరిస్థితి. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదేసి టీమ్స్‌ ఉన్నాయి. గ్రూప్‌-ఏలో ఇండియాతో పాటు ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, పాకిస్థాన్‌, కెనడా జట్లు ఉన్నాయి. వీటిలో ఇండియా, యూఎస్‌ఏ రెండేసి విజయాలతో పాయింట్ల పట్టికలో గ్రూప్‌-ఏలో టాప్‌2గా ఉన్నాయి. దీంతో.. గ్రూప్‌ దశలోనే పాకిస్థాన్‌ ఇంటి బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రతి గ్రూప్‌లో ఉన్న టీమ్‌.. అదే గ్రూప్‌లో ఉన్న మిగిలిన నాలుగు టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అలా అన్ని టీమ్స్‌ మ్యాచ్‌లు పూర్తి అయిన తర్వాత.. టాప్‌ 2లో నిలిచిన జట్లు సూపర్‌ 8కు అర్హత సాధిస్తాయి. అయితే.. గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో ఇండియా చేతిలో ఓటమి పాలైంది. ఇంకా పాక్‌కు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌లు గెలిచినా కూడా పాక్‌ ముందుకు వెళ్లడం కష్టమే. ఎందుకంటే.. యూఎస్‌కేకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.. ఇండియాతో ఒకటి ఐర్లాండ్‌తో మరొకటి. ఇండియాతో ఆ జట్టు ఓడిపోయినా.. ఐర్లాండ్‌పై గెలిస్తే.. పాక్‌ ఇంటి, ఇండియాతో కలిసి యూఎస్‌కే సూపర్‌ 8కు వెళ్తుంది. ఒక వేళ యూఎస్‌కే మిగిలిన రెండు మ్యాచ్‌లో ఓడి, పాక్‌ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. అప్పుడు 4 పాయింట్లతో రెండు టీమ్స్‌ సమంగా ఉంటాయి. రన్‌ రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు సూపర్‌ 8కు వెళ్తుంది.

ప్రస్తుతం యూఎస్‌కే రన్‌రేట్‌ +0.626గా ఉంది. ఒకవేళ ఆ టీమ్‌ రెండు మ్యాచ్‌లు ఓడితే.. రన్‌రేట్‌ పడిపోయే అవకాశం ఉంది. అలాగే పాక్‌ రన్‌రేట్‌ ప్రస్తుతం -0.150గా ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. రన్‌రేట్ మెరుగుపడుతుంది. అయితే.. యూఎస్‌కే మరో మ్యాచ్‌ గెలిచినా, పాక్‌ మరో మ్యాచ్‌ ఓడినా.. పాక్‌ ఇంటికి, యూఎస్‌కే సూపర్‌ 8కు వెళ్తాయి. ఇక ఇంగ్లండ్‌ విషయానికి వస్తే.. గ్రూప్‌-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు స్కాట్లాండ్‌, నమీబియా, ఒమన్‌ జట్టు ఉన్నాయి. స్కాట్లాండ్‌తో తొలి మ్యాచ్ రద్దవ్వగా.. ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోయింది.

ప్రస్తుతం ఇంగ్లండ్‌ రన్‌రేట్ -1.800 గా ఉంది. ఒమన్, నమీబియా దేశాలపై ఇంగ్లండ్ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 5 పాయింట్లు మాత్రమే చేరుతాయి. అప్పుడు స్కాంట్లాండ్‌తో సమంగా నిలుస్తోంది. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్టు సూపర్‌ 8కు అర్హత సాధిస్తోంది. స్కాట్లాండ్‌ రన్‌రేట్‌ ప్రస్తుతం +2.164గా ఉంది. ఒక వేళ ఆసీస్ చేతిలో స్కాంట్లాండ్ చిత్తుగా ఓడి.. ఇంగ్లండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధిస్తే తప్పా టోర్నీలో కొనసాగే పరిస్థితి లేదు. అయితే.. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్‌ అంత సులువుగా లేవు. అందుకే.. గ్రూప్‌ స్టేజ్‌లోనే పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ ఇంటిబాట పట్టేలా ఉన్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఈ రెండు టీమ్స్‌ ఫైనల్స్‌ ఆడిన విషయం తెలిసిందే.