iDreamPost
android-app
ios-app

Khurram Shahzad: వీడియో: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. ఇంతమాత్రం దానికే అంత బిల్డప్పా?

  • Published Aug 23, 2024 | 5:38 PM Updated Updated Aug 23, 2024 | 5:38 PM

PAK vs BAN, Khurram Shahzad: పాకిస్థాన్ క్రికెటర్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఇలాగే వైరల్ అవుతన్నాడు. ఓవరాక్షన్ చేసి విమర్శలపాలవుతున్నాడు.

PAK vs BAN, Khurram Shahzad: పాకిస్థాన్ క్రికెటర్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఇలాగే వైరల్ అవుతన్నాడు. ఓవరాక్షన్ చేసి విమర్శలపాలవుతున్నాడు.

  • Published Aug 23, 2024 | 5:38 PMUpdated Aug 23, 2024 | 5:38 PM
Khurram Shahzad: వీడియో: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్.. ఇంతమాత్రం దానికే అంత బిల్డప్పా?

పాకిస్థాన్ క్రికెటర్లు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా చెత్త ఫీల్డింగ్ వల్ల వైరల్ అవుతుంటారు. పాక్ క్రికెటర్లు క్యాచ్ లు వదిలేయడం, రనౌట్లు మిస్ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం చూసే ఉంటారు. అనవసర బిల్డప్ లు ఇవ్వడం, ఓవరాక్షన్ చేయడంలోనూ ఆ టీమ్ ప్లేయర్లు ముందంజలో ఉంటారు. కొందరు పాక్ క్రికెటర్లు వికెట్లు తీసినా, భారీ స్కోరు చేసినా ఓవర్ గా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇలాంటి పనితో వైరల్ అవుతున్నాడు. అవసరం లేకపోయినా ఓవరాక్షన్ చేసి విమర్శల పాలవుతున్నాడు. ఆ ఆటగాడి పేరు ఖుర్రం షాజాద్. అతడేం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాకిస్థాన్ యంగ్ పేసర్ ఖుర్రం షాజాద్ ఓవరాక్షన్ తో వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ 52వ ఓవర్ వేసేందుకు వచ్చాడు షాజాద్. ఆ ఓవర్ తొలి బంతికే మోమినుల్ హక్ (50)ను ఔట్ చేశాడు. చక్కటి ఇన్ స్వింగర్ తో మోమినుల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గుడ్ లెంగ్త్ లో పడిన బంతి లోపలికి దూసుకొచ్చింది. మోమినుల్ దాన్ని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే అతడి బ్యాట్ ను దాటేసిన బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. వికెట్ పడిన సంతోషంలో పాక్ ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఖుర్రం మాత్రం ఓవరాక్షన్ చేశాడు. బ్యాట్స్ మన్ దగ్గరకు వెళ్లి కుడిచేతితో గాల్లో పంచులు విసురుతూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత సహచరుల దగ్గరకు వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఖుర్రం షాజాద్ ఓవరాక్షన్ చేసినా బ్యాట్స్ మన్ మోమినుల్ సైలెంట్ గా క్రీజును విడిచి పెవిలియన్ దిశగా వెళ్లిపోయాడు. అతడు రెచ్చగొట్టినా ఏమీ అనలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఖుర్రంను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తీసింది నార్మల్ బ్యాటర్ వికెట్.. అదేదో టాప్ బ్యాటర్ ను ఔట్ చేసినట్లు ఎందుకంత ఓవర్ గా బిల్డప్ ఇచ్చావని విమర్శిస్తున్నారు. బచ్చా బ్యాటర్లను ఔట్ చేసినందుకు ఇంతగా సెలబ్రేట్ చేసుకుంటే.. తోపు బ్యాటర్ ను ఔట్ చేస్తే గ్రౌండ్ విడిచి పారిపోతాడేమోనని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇంత ఓవరాక్షన్ పనికిరాదని, ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడం నేర్చుకోమని సూచిస్తున్నారు. గేమ్ మీద ఫోకస్ చేస్తే ఎదుగుతాడని, ఇలాగే అతిగా బిహేవ్ చేస్తే కష్టమేనని అంటున్నారు. మొత్తానికి ఒక్క వికెట్ తో బాగా వైరల్ అవుతున్నాడు ఖుర్రం.