iDreamPost
android-app
ios-app

నా కుటుంబంలో ఒకరిని కోల్పోయాను! కుల్దీప్‌ యాదవ్‌ ఎమోషనల్‌

  • Published Aug 23, 2024 | 4:48 PM Updated Updated Aug 23, 2024 | 4:48 PM

Kuldeep Yadav, Shane Warne, MCG: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఎమోషనల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన ఫీలింగ్‌ వస్తుందంటూ పేర్కొన్నాడు. అలా ఎందుకన్నాడు? ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Kuldeep Yadav, Shane Warne, MCG: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఎమోషనల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన ఫీలింగ్‌ వస్తుందంటూ పేర్కొన్నాడు. అలా ఎందుకన్నాడు? ఎవరి గురించి అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 23, 2024 | 4:48 PMUpdated Aug 23, 2024 | 4:48 PM
నా కుటుంబంలో ఒకరిని కోల్పోయాను! కుల్దీప్‌ యాదవ్‌ ఎమోషనల్‌

భారత క్రికెట్‌ జట్టుకు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో.. టీమిండియా క్రి​కెటర్లు చాలా మంది వేకేషన్లలో ఉన్నారు. తాజాగా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా ట్రిప్‌కి వెళ్లాడు. ఫ్యామిలీతో కలిసి కంగారుల దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక క్రికెట్‌ స్టేడియం ‘మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)’ని కూడా సందర్శించాడు. స్టేడియం బయట ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ విగ్రహం ముందు నిల్చోని ఫొటో దిగి.. ఆ ఫొటోను తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. వార్న్‌ గురించి మాట్లాడుతూ.. కుల్దీప్‌ యాదవ్‌ కాస్త ఎమోషలన్‌ అయ్యాడు.

‘షేన్‌ వార్న్‌ నా ఐడల్‌, అతనితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. ఆయనను తల్చకుంటే.. ఇప్పటికీ నేను ఎమోషనల్‌ అవుతాను.. నా కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయిన భావన వస్తుంది’ అంటూ కుల్దీప్‌ పేర్కొన్నాడు. ఒక స్పిన్నర్‌గా.. కుల్దీప్ యాదవ్‌, షేన్‌ వార్న్‌ను ఎంతో అభిమానిస్తాడు. ఆ విషయాన్ని అనేక సార్లు చెప్పాడు. వార్న్‌ స్ఫూర్తిగా ఆయనంత గొప్ప స్పిన్‌ బౌలర్‌ అవ్వాలని కుల్దీప్‌ కలలు కనేవాడు. ప్రస్తుతం వాటిని నిజం చేసుకునే పనిలోనే ఉన్నాడు. అయితే.. ఆసీస్‌ పర్యటనలో భాగంగా.. వార్న్‌ స్ట్యాచ్యూ చూసి ఎమోషనల్‌ అయ్యాడు.

ఎంసీజీతో పాటు క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ క్వార్డర్స్‌ను కూడా సందర్శించాడు కుల్దీప్‌ యాదవ్‌. క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో నిక్‌ హోక్లీ.. కుల్దీప్‌కు ఘనస్వాగతం పలికారు. ఎంసీజీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని కుల్దీప్‌ యాదవ్‌ అన్నాడు. అలాగే రాబోయే ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా బోర్డర్‌ గవాస్కర్‌ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. సెప్టెంబర్‌ 19 నుంచి టీమిండియా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. అంతకంటే ముందు కుల్దీప్‌ యాదవ్‌ దేశవాళి ట్రోర్నీ దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నాడు. మరి వార్న్‌ను తల్చుకుంటూ.. తన ఫ్యామిలీలో ఒక వ్యక్తి కోల్పోయిన ఫీలింగ్‌ వస్తుందంటూ కుల్దీప్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.