P Venkatesh
భారత్, బంగ్లా మ్యాచ్ లో భారత్ ను ఓడిస్తే బంగ్లా జట్టు క్రికెటర్ తో డిన్నర్ డేట్ కి వెళ్తానంటూ పాక్ నటి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ భారత్ ఓడిపోవాలన్న ఆమె కళ నెరవేరలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించింది నటి షిన్వారి. ఆమె ఏమన్నదంటే?
భారత్, బంగ్లా మ్యాచ్ లో భారత్ ను ఓడిస్తే బంగ్లా జట్టు క్రికెటర్ తో డిన్నర్ డేట్ కి వెళ్తానంటూ పాక్ నటి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ భారత్ ఓడిపోవాలన్న ఆమె కళ నెరవేరలేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓటమిపాలైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించింది నటి షిన్వారి. ఆమె ఏమన్నదంటే?
P Venkatesh
వన్డే వరల్డ్ కప్ 2023 అద్భుతంగా సాగిపోతున్నది. లీగ్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతూ ఫ్యాన్స్ కు ఎనలేని ఎంటర్ టైన్ మెంట్ ను పంచుతున్నాయి. ఆటగాళ్ల మధ్య కవ్వింపులు, ఎమోషన్స్ ఒకటేమిటీ ఇలా ఎన్నో వాటికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రపంచ కప్ టోర్నమెంట్. ఇటీవల భారత్, పాక్ మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో దాయాదులను చావుదెబ్బకొట్టింది టీమిండియా. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు పాక్ అభిమానులు. తదుపరి భారత్ ఆడబోయే మ్యాచ్ లలో ఓడిపోవాలని విషం కక్కారు. ఇదే విధంగా పాక్ చెందిన ఓ నటి కూడా తన అక్కసును వెల్లగక్కింది.
భారత్, బంగ్లా మధ్య జరిగే మ్యాచ్ లో బంగ్లా భారత్ ను ఓడిస్తే ఆ జట్టు క్రికెట్ ర్ తో డిన్నర్ డేట్ కి వెళ్తానంటూ సంచలన ప్రకటన చేసింది. అయితే ఆమె ఆఫర్ ను పక్కన పెడితే నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాను టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో పాక్ నటి షిన్వారీ మరోసారి స్పందించింది. ఇప్పుడు బంగ్లాను ప్రశంసిస్తూ.. పాక్ కు పరోక్షంగా చురకలంటించింది. షిన్వారీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. బంగ్లా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబర్చారు. భారత్ కు గట్టి పోటీ ఇచ్చారని ప్రశంసించింది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ కనీసం పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పకనే చెప్పింది.
కాగా నిన్న జరిగిన భారత్ బంగ్లా మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 256 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్ తో ఏడు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. ఇక ఈ సారి వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించిన రోహిత్ సేన ప్రపంచ కప్ లో జైత్ర యాత్రను కొనసాగిస్తోంది.