Olympic Medalist Sarabjot Singh Rejects Govt Job: దేశం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదన్న సరబ్​జోత్.. నీ గట్స్​కు హ్యాట్సాఫ్​!

Sarabjot Singh: దేశం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదన్న సరబ్​జోత్.. నీ గట్స్​కు హ్యాట్సాఫ్​!

Paris Olympics 2024: యంగ్ షూటర్ సరబ్​జోత్ సింగ్ ఒలింపిక్స్​లో మెరిసిన సంగతి తెలిసిందే. షూటింగ్​లో మిక్స్​డ్ ఈవెంట్​లో భారత్​కు పతకాన్ని అందించాడతను.

Paris Olympics 2024: యంగ్ షూటర్ సరబ్​జోత్ సింగ్ ఒలింపిక్స్​లో మెరిసిన సంగతి తెలిసిందే. షూటింగ్​లో మిక్స్​డ్ ఈవెంట్​లో భారత్​కు పతకాన్ని అందించాడతను.

పారిస్ ఒలింపిక్స్​-2024 ఆరంభంలోనే భారత్​కు మంచి స్టార్ట్ లభించింది. విమెన్ షూటర్ మనూ భాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచి కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేసింది. ఆ తర్వాత మరో యంగ్ షూటర్ సరబ్​జోత్ సింగ్​తో కలసి షూటింగ్ 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ మిక్స్​డ్ ఈవెంట్​లో మరో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మనూ-సరబ్​జోత్ జోడీ 16-10 పాయింట్ల తేడాతో నెగ్గడంతో దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ గెలుపుతో 124 ఏళ్లలో ఒకే ఒలింపిక్స్​లో 2 మెడల్స్ సాధించిన భారత అథ్లెట్​గా మనూ చరిత్ర సృష్టించింది. ఆమెతో పాటు సరబ్​జోత్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగింది. రీసెంట్​గా స్వదేశానికి వచ్చిన వీళ్లకు ఘనస్వాగతం లభించింది. అదే టైమ్​లో భారీ నజరానా కూడా దక్కింది. అయితే సరబ్​జోత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒలింపిక్ మెడల్స్ గెలిచిన మనూ భాకర్-సరబ్​జోత్ సింగ్​కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రెండు పతకాలు నెగ్గిన మనూకు రూ.5 కోట్లు, సరబ్​జోత్​కు రూ.2.5 కోట్ల క్యాష్​మనీని ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసింది. హరియానా స్టేట్ స్పోర్ట్స్ డిపార్ట్​మెంట్​లో డిప్యూటీ డైరెక్టర్​ పోస్ట్​ను సరబ్​జోత్​కు ఆ రాష్ట్ర సర్కారు ఆఫర్ చేసింది. అయితే అతడు దేశం కోసం ఈ ఆఫర్​ను సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. షూటింగ్​ మీద మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యానని.. భవిష్యత్తులో భారత్​కు మరిన్ని పతకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు సరబ్​జోత్ తెలిపాడు. సర్కారు కొలువును ఆఫర్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన ఈ యంగ్ షూటర్.. ఇప్పుడు తాను ఉద్యోగం చేయాలనుకోవట్లేదని స్పష్టం చేశాడు.

‘గవర్నమెంట్ నుంచి జాబ్ ఆఫర్ రావడం మంచిదే. కానీ నేను ఇప్పుడు ఉద్యోగం చేయాలని అనుకోవడం లేదు. నా ధ్యాస అంతా షూటింగ్ మీదే ఉంది. నా గేమ్​ను బెటర్​ చేసుకోవడంపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యా. నా కుటుంబసభ్యులు కూడా మంచి జాబ్ చూసుకోమని అంటున్నారు. కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. షూటింగ్​లోనే కొనసాగాలనేది నా కోరిక. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు. ఇప్పుడు ఉద్యోగం చేసే ప్రసక్తే లేదు’ అని సరబ్​జోత్ కుండబద్దలు కొట్టాడు. దేశానికి ఒలింపిక్స్​లో ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయం, అలాంటిది మెడల్ కూడా సాధించినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. తన షూటింగ్ జర్నీలో ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. సరబ్​జోత్ డెసిషన్​ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అథ్లెట్ల అవసరం దేశానికి ఉందని.. నీ గట్స్​కు హ్యాట్సాఫ్ బాస్ అని మెచ్చుకుంటున్నారు. మరి.. దేశం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని సరబ్​జోత్ కాదనడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments