Nidhan
Aman Sehrawat-Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు.
Aman Sehrawat-Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు.
Nidhan
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. 21 ఏళ్ల యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. దీంతో మన దేశం సాధించిన పతకాల సంఖ్య 6కు చేరింది. ఇందులో ఐదు కాంస్య పతకాలు, ఒక రజతం ఉంది. అయితే ఇప్పుడు అమన్ సెహ్రావత్ మెడల్ సాధించడం మీద కాకుండా రాత్రికి రాత్రే అమాంతం 4.6 కిలోలు బరువు తగ్గడం పైన చర్చ జరుగుతోంది. విమెన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో డిస్క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఇదే సమస్యను అమన్ కూడా ఎదుర్కొన్నాడు. అయితే వినేశ్ ఘటనతో అలర్ట్ అయిన అతడు పట్టుదలతో కేవలం 10 గంటల్లో నాలుగున్నర కేజీలు తగ్గి ఔరా అనిపించాడు.
సెమీఫైనల్లో ఓటమి తర్వాత అమన్ బరువు 61.5 కిలోలు ఉందట. అయితే అతడు పోటీపడుతోంది 57 కేజీల విభాగంలో కావడంతో బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో మరునాడు పోటీ కోసం తీవ్రంగా శ్రమించాడు. అందుకోసం సీనియర్ కోచ్‌లు వీరేందర్ దహియా, జగ్మందర్ సింగ్‌తో పాటు మరో ఆరుగురు నిపుణుల బృందం కష్టపడ్డారు. వినేశ్ ఫొగాట్లా అమన్ నష్టపోకూడదని దీన్నో మిషన్లా తీసుకొని పనిచేశారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు సెమీస్ మ్యాచ్‌లో తలపడ్డ అమన్.. ఆ బౌట్లో ఓడిపోయాడు. దీంతో బ్రాంజ్ మెడల్ ఫైట్‌లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. అందుకోసం అతడి బరువును తూచారు. కానీ వెయిట్ ఎక్కువ ఉండటం, బరువు తగ్గేందుకు సరిగ్గా 10 గంటల టైమ్ ఉండటంతో కోచింగ్ బృందం అప్రమత్తం అయ్యారు. అమన్‌ను గంటపాటు వేడినీటితో స్నానం, ఆ తర్వాత ఆగకుండా ట్రెడ్మిల్ మీద కంటిన్యూగా రన్నింగ్ చేయించారు.
వేడినీటి స్నానం, రన్నింగ్ ముగిశాక అమన్‌ను జిమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు కఠినమైన ఎక్సర్సైజ్లు చేయించారు. అనంతరం మళ్లీ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఐదు నిమిషాల చొప్పున ఐదు సెషన్ల పాటు ఈ రెజ్లర్‌ను సానా బాత్ చేయించారు. ఆఖరి సెషన్ సమయానికి అమన్ 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు గుర్తించిన కోచ్‌లు నెమ్మదిగా జాగింగ్ చేయమని సూచించారు. దీంతో అతడు 56.9 కిలోలకు చేరాడు. అమన్ సరైన వెయిట్ ఉండటంతో భారత కోచ్‌లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ పది గంటల్లో తాను నిద్రపోలేదని.. రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉండిపోయానని అమన్ తెలిపాడు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్.. వినేశ్ విషయంలోనూ ఇంకొంత జాగ్రత్తగా వహిస్తే భారత్‌కు మరో మెడల్ దక్కేది కదా అని అంటున్నారు. ఏదేమైనా అమన్‌ను మెచ్చుకోకుండా ఉండలేమని.. పతకం కోసం అతడు పడిన శ్రమకు ఫలితం దక్కిందని అభినందిస్తున్నారు.