ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి ద్రవిడ్-రోహిత్ సూపర్ ప్లాన్!

  • Author singhj Published - 08:16 PM, Fri - 6 October 23
  • Author singhj Published - 08:16 PM, Fri - 6 October 23
ఆస్ట్రేలియాను చిత్తు చేయడానికి ద్రవిడ్-రోహిత్ సూపర్ ప్లాన్!

వన్డే వరల్డ్ కప్-2023లో హాట్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో పాటు భారత్ కూడా ఈసారి సెమీస్​కు చేరుకునే ఛాన్సులు గట్టిగా ఉన్నాయని వెటరన్ క్రికెటర్లతో పాటు అనలిస్టులు కూడా అంటున్నారు. సొంతగడ్డ మీద జరుగుతున్న ప్రపంచ కప్​లో భారత్ ఛాంపియన్​గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగే ఫస్ట్ మ్యాచ్​తో టీమిండియా వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత అఫ్ఘానిస్థాన్​తో రెండో మ్యాచ్​ ఆడనున్న భారత్.. మూడో మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆస్ట్రేలియాతో ఆడబోయే ఫస్ట్ మ్యాచ్​ భారత్​కు ఎంతో కీలకం కానుంది. ఫేవరెట్లలో ఒకటైన కంగారూలను ఓడిస్తే టీమ్​లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. అప్పుడు పాక్​తో తర్వాతి మ్యాచ్​లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చు. వరల్డ్ కప్​లో అద్భుతమైన రికార్డు ఉన్న ఆసీస్​ లాంటి టీమ్​ను సెమీస్​లో ఆపడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడే ఝలక్ ఇస్తే ఆ జట్టు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. రీసెంట్​గా జరిగిన వన్డే సిరీస్​లో ఎలాగూ ఓడించాం.. కాబట్టి మరోమారు ఆ టీమ్​ను ఓడిస్తే ఆ గెలుపు గాలివాటం కాదని ప్రూవ్ అవుతుంది. అయితే వరల్డ్ కప్​ లాంటి మెగా టోర్నీలో సొంత అభిమానుల మధ్య తీవ్ర ఒత్తిడిలో ఆసీస్​ లాంటి టాప్ టీమ్​ను ఎదుర్కోవడం భారత్​కు అంత ఈజీ కాదు.

మెగా టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ చెన్నైలో జరుగుతుండటం సానుకూలాంశమని చెప్పొచ్చు. చెన్నై పిచ్ స్పిన్​కు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగారూల కోసం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. ఆసీస్​ను స్పిన్ ఉచ్చులో చిక్కేలా చేసి చిత్తు చేయాలని వ్యూహం పన్నుతున్నారట. అందుకోసం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​తో పాటు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్​లను రెడీ చేస్తున్నారట. టీమ్​లో ప్లేస్ ఫిక్స్ అని వారికి ముందే సమాచారం ఇచ్చి.. ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసేందుకు స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం.

ఒక్కో బ్యాటర్​కు వాళ్ల వీక్​నెస్​ను బట్టి ఎలా ఔట్ చేయాలనే దానిపై ద్రవిడ్-రోహిత్ స్కెచ్ వేస్తున్నారట. పిచ్ ఏమాత్రం టర్నింగ్​కు అనుకూలించినా ఆసీస్​ను స్పిన్ అటాక్​తో కుప్పకూల్చాలని చూస్తున్నారట. అయితే మ్యాచ్ జరిగే రోజు పిచ్ కండీషన్​తో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి జట్టు కూర్పులో మార్పులు ఉన్నా ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే ఆసీస్​తో మ్యాచ్​లో టీమిండియా స్పిన్ వ్యూహంతో బరిలోకి దిగుతుందా? లేదా ఇంకేదైనా వేరే ప్లాన్​తో వస్తారా? అనేది చూడాలి. మరి.. ఈ విషయంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా మాజీ కెప్టెన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు కమిటీ!

Show comments