iDreamPost

టీమిండియా మాజీ కెప్టెన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు కమిటీ!

  • Author singhj Published - 05:52 PM, Fri - 6 October 23
  • Author singhj Published - 05:52 PM, Fri - 6 October 23
టీమిండియా మాజీ కెప్టెన్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు కమిటీ!

భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది ప్లేయర్లు సేవలు అందించారు. వారిలో కొందరు కెప్టెన్​గానూ వ్యవహరించారు. తమ అద్భుతమైన టాలెంట్​తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. అలాంటి వారిలో మహ్మద్ అజహరుద్దీన్ ఒకరు. బ్యాట్స్​మన్​గా, సారథిగా భారత జట్టు సక్సెస్​లో కీలక పాత్ర పోషించాడు. కాగా, అజహరుద్దీన్​కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగబోయే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్​సీఏ) ఎలక్షన్స్​లో పోటీ చేయడానికి అజార్​ను అనర్హుడిగా ప్రకటించింది సుప్రీం కోర్టు కమిటీ.

బోర్డు నిబంధనలను అతిక్రమించినందుకు గానూ అజహరుద్దీన్​ను అనర్హుడిగా ప్రకటిస్తున్నామని సుప్రీం కోర్టు మాజీ జడ్జి అధ్యక్షతన ఎన్నికైన కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2019 సెప్టెంబర్​లో జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజార్ గెలుపొందారు. అప్పటి నుంచి ఏడాది వరకు ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తన పదవీకాలం ముగిసినా సుప్రీం కోర్టు కొత్తగా సింగిల్ మెంబర్ ప్యానెల్​ను నియమించే వరకు ఆ పదవిలో కొనసాగారు. త్వరలో హెచ్​సీఏ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి పోటీ చేసేందుకు అజార్ రెడీ అవుతున్నారు. ఈ టైమ్​లో హెచ్​సీఏ కార్యకలాపాలు చూసుకోవడం కోసం సుప్రీం కోర్టు మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు అధ్యక్షతన ఒక కమిటీని సుప్రీం ఏర్పాటు చేసింది.

అజహరుద్దీన్ మళ్లీ హెచ్​సీఏ ఎలక్షన్స్​లో పోటీ చేయడానికి అనర్హుడని ప్రకటించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ.. ఆయన ఓటు హక్కును కూడా తొలగించింది. ఏదైనా క్లబ్​లో ఎగ్జిక్యూటివ్ మెంబర్​గా ఉన్న వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా ఇతర క్లబ్స్ మేనేజ్​మెంట్​లో సభ్యులుగా ఉంటే సదరు వ్యక్తి మెంబర్​షిప్​తో పాటు అతడి ఓటు హక్కు 3 ఏళ్ల పాటు లేదా నెక్స్ట్ ఎలక్షన్స్​లో పోటీ చేసే అధికారాన్ని కోల్పోతారని ఆ ప్రకటనలో సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. అజార్ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగిందని కమిటీ రిలీజ్ చేసిన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

కమిటీ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. సుప్రీం కోర్టు నియమించిన సూపర్ వైజర్ కమిటీ-2022, సెప్టెంబర్ 31న అప్పటి ప్రెసిడెంట్ అజహరుద్దీన్​ను హెచ్​సీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని క్రికెట్ క్లబ్​ల వివరాలను సేకరించి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 10వ తేదీన డెక్కన్ బ్లూ క్రికెట్ క్లబ్ నుంచి ఆ క్లబ్ సెక్రటరీ మాన్​సింగ్ ద్వారా ఒక నివేదిక అందింది. ఇందులో అజార్​ను క్లబ్ అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా రూల్స్ ఉల్లంఘించి ఒకటి కంటే ఎక్కువ క్లబ్​లకు ప్రెసిడెంట్​గా ఉన్నందున ఆయన్ను ఎలక్షన్స్​లో పోటీచేయకుండా అనర్హుడిగా ప్రకటించామని సుప్రీం కమిటీ పేర్కొంది.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి