వరుసగా ఓటములు.. ఆ ఒక్క నిర్ణయమే కంగారూల కొంప ముంచిందా?

  • Author singhj Published - 02:25 PM, Fri - 13 October 23
  • Author singhj Published - 02:25 PM, Fri - 13 October 23
వరుసగా ఓటములు.. ఆ ఒక్క నిర్ణయమే కంగారూల కొంప ముంచిందా?

క్రికెట్​లో ఒకప్పుడు వెస్టిండీస్​దే ఆధిపత్యం. కరీబియన్ టీమ్ గ్రౌండ్​లోకి దిగుతోందంటే ప్రత్యర్థి జట్లు గజగజలాడేవి. అయితే 90వ దశకం నుంచి అంతా మారిపోయింది. విండీస్​ టీమ్ మునుపటి స్థాయిలో జెంటిల్మన్ గేమ్​పై తన ప్రభావం చూపడంలో ఫెయిలైంది. వెస్టిండీస్ ఆధిపత్యం తగ్గడం, ఆస్ట్రేలియా ప్రతాపం చూపించడం దాదాపుగా ఒకేసారి జరిగింది. గత మూడు దశాబ్దాల నుంచి క్రికెట్ గ్రౌండ్​లో ఆసీస్​దే పెత్తనం నడుస్తోంది. మధ్యలో టీమిండియా, ఇంగ్లండ్ లాంటి జట్లు వరల్డ్ కప్స్ నెగ్గినా.. ఆసీస్ మాత్రం ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూ వస్తోంది. ముఖ్యంగా వరల్డ్ కప్స్​లో ఆ టీమ్​కు ఘనమైన రికార్డు ఉంది.

ఇప్పటిదాకా జరిగిన వన్డే వరల్డ్ కప్స్​లో ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిచింది కంగారూ టీమ్. మెగా టోర్నీలో కనీసం సెమీస్, ఫైనల్స్​కు చేరడం ఆ జట్టుకు ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రపంచ కప్-2023లో మాత్రం ఆసీస్ దారుణంగా ఫెయిల్ అవుతోంది. వరుస మ్యాచుల్లో ఓటమితో ఆ టీమ్ డీలా పడిపోయింది. మొదటి మ్యాచ్​లో భారత్ చేతిలో కంగుతున్న కంగారూలు.. రెండో మ్యాచ్​లో అండర్​డాగ్స్ సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అసలు ఆడుతోంది ఆసీసేనా? అనేంత చెత్తగా ఆ టీమ్ పెర్ఫార్మెన్స్ ఉంది. బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో ఘోరంగా విఫలమవుతోంది ఆస్ట్రేలియా.

తొలి రెండు మ్యాచుల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో సీనియర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ సహా మిచెల్ మార్ష్, జాష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టొయినిస్ ఫెయిలయ్యారు. ఆదుకుంటాడనుకున్న గ్లెన్ మ్యాక్స్​వెల్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. స్పిన్నర్ ఆడమ్ జంపా వైఫల్యం కూడా టీమ్​పై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆరంభంలో, చివర్లో వికెట్లు తీస్తున్న ఆసీస్ పేసర్లు మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నారు. ఆ టీమ్ ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫీల్డింగ్​కు పేరు గాంచిన ఆసీస్​ ప్లేయర్లు క్యాచులు చేజార్చుతూ, బౌండరీలు మిస్ చేస్తుండటాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆస్ట్రేలియా టీమ్​లో గెలవాలన్న కసి, పట్టుదల, తపన కనిపించడం లేదు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ కూడా సరిగ్గా లేదు. అయితే ఇన్ని చెప్పుకున్నా గానీ ఆసీస్ వరుస ఓటములకు ఒక నిర్ణయమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అదే కెప్టెన్సీ. టెస్టుల్లో కంగారూ టీమ్​ను అద్భుతంగా నడిపిస్తున్న ప్యాట్ కమిన్స్​ను వన్డేల్లో కెప్టెన్​గా నియమించడం పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈసారి వరల్డ్ కప్​లో బౌలింగ్​ ఛేంజెస్​తో పాటు ఫీల్డ్ ప్లేస్​మెంట్స్​లో కమిన్స్ తీసుకున్న డెసిజన్స్ టీమ్​కు ప్రతికూలంగా మారాయి. ఫస్ట్ మ్యాచ్​లో భారత్ మూడు వికెట్లు కోల్పోయిన టైమ్​లో ట్రంప్ కార్డ్ అయిన ఆడమ్ జంపాను బౌలింగ్​కు దింపలేదు.

భారత్​తో మ్యాచ్​లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకొని, ఈజీగా రన్స్ వస్తున్న టైమ్​లో జంపాతో బౌలింగ్ వేయించాడు కమిన్స్.  జంపా ఫస్ట్ ఓవర్లోనే రాహుల్ మూడు బౌండరీలు బాదాడు. దీంతో జంపా కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వికెట్లు రాకపోగా.. పరుగులు కూడా సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్​లోనూ మిడిల్ ఓవర్లలో రన్స్​ను ఆపడంలో, బౌలింగ్ ఛేంజెస్ చేయడంలో కమిన్స్ ఫెయిల్ అయ్యాడు. వన్డేల్లో కెప్టెన్సీ చేసిన ఎక్స్​పీరియెన్స్ ఉన్న స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ ప్లేయర్ టీమ్​లో ఉన్నా కమిన్స్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఆసీస్ మేనేజ్​మెంట్ నిర్ణయం ఆ జట్టును దెబ్బతీస్తోందని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు.

దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యర్థులను కన్​ఫ్యూజ్ చేస్తూ బౌలింగ్ మార్పులు చేయడం, బ్యాటింగ్​లో అటాకింగ్ గేమ్​తో భయపెట్టడం స్మిత్​ కెప్టెన్సీలో చూశాం. ఇప్పుడు కూడా అతడికే పగ్గాలు అప్పజెప్పి ఉంటే మొదటి రెండు మ్యాచుల్లో రిజల్ట్ వేరేలా ఉండేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ చెబుతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. స్మిత్​కు ఛాన్స్ ఇస్తే ఆసీస్ రాత మారుతుందని సూచిస్తున్నారు. కాగా, 54 వన్డేల్లో ఆసీస్​కు కెప్టెన్​గా వ్యవహరించాడు స్మిత్. ఇందులో 27 మ్యాచుల్లో గెలిచిన కంగారూ టీమ్.. 24 మ్యాచుల్లో ఓటమి పాలైంది. మరో 3 మ్యాచుల్లో రిజల్ట్ రాలేదు. అతడి విజయాల శాతం 50గా ఉంది. మరి.. కమిన్స్​ కెప్టెన్సీ ఫెయిల్యూర్ వల్లే ఆసీస్​కు ఓటములు తప్పట్లేదని వస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: పాక్‌తో మ్యాచ్‌కు డెంగ్యూతోనే గిల్‌! అండగా యువరాజ్‌

Show comments