iDreamPost
android-app
ios-app

నవంబర్ లో రోహిత్ కి అదృష్టం! ఈ లెక్కన వరల్డ్ మనదేనా?

  • Author Soma Sekhar Published - 03:14 PM, Thu - 2 November 23

ఈ వరల్డ్ కప్ టీమిండియానే గెలుస్తుందని, అందుకు కారణం రోహిత్ శర్మకు నవంబర్ నెలకు ఉన్న సంబంధమేనని క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వరల్డ్ కప్ టీమిండియానే గెలుస్తుందని, అందుకు కారణం రోహిత్ శర్మకు నవంబర్ నెలకు ఉన్న సంబంధమేనని క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 03:14 PM, Thu - 2 November 23
నవంబర్ లో రోహిత్ కి అదృష్టం! ఈ లెక్కన వరల్డ్ మనదేనా?

వరల్డ్ కప్ 2023లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. అందుకు తగ్గట్లుగానే అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించి దాదాపు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక ఏడో విజయం కోసం శ్రీలంకతో తలపడబోతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ న్యూస్ టీమిండియా ఫ్యాన్స్ ను తెగ సంతోషానికి గురిచేస్తోంది. అసలు విషయం ఏంటంటే? ఈ వరల్డ్ కప్ టీమిండియానే గెలుస్తుందని, అందుకు కారణం రోహిత్ శర్మ అంటూ రికార్డులతో సహా వివరిస్తున్నారు. అదీకాక 2011 నుంచి వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న జట్టే విజేతగా నిలుస్తుండటంతో.. ఈ సెంటిమెంట్ కూడా భారత్ కు కలిసొచ్చి.. ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి వరల్డ్ కప్ గెలవడంలో రోహిత్ సెంటిమెంట్ ఏంటి? నవంబర్ నెలతో రోహిత్ కు ఉన్న అనుబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలు ప్రారంభం అయినప్పుడు.. వాటి వెనకాలే కొన్ని సెంటిమెంట్స్ కూడా బయలుదేరుతాయి. అయితే ఆ సెంటిమెంట్స్ చాలా సార్లు నిజమైన సందర్భాలు లేకపోలేదు. ఇక వరల్డ్ కప్ 2023 ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్నో సెంటిమెంట్స్ మనం వింటూనే ఉన్నాం. అందులో ఒకటి 2011 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య టీమ్ విజేతగా నిలవడం. ఇక తాజాగా మరో సెంటిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈసారి వరల్డ్ కప్ గెలిచేది టీమిండియానేనట. ఇక దానికి ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ అని గత రికార్డులు చెబుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఇక ఇదే నవంబర్ నెల హిట్ మ్యాన్ కు అచ్చొచ్చింది. ఈ నెలలో రోహిత్ తన తొలి డబుల్ సెంచరీతో పాటుగా మరో ద్విశతకాన్ని నమోదు చేశాడు. 2014లో శ్రీలంకపై నవంబర్ 13న 264 రన్స్ చేశాడు. ఇదే కాకుండా ఓ అంతర్జాతీయ టీ20 సెంచరీని కూడా బాదాడు. అదీకాక 2020లో నవంబర్ లోనే ఐపీఎల్ ట్రోఫీని సైతం రోహిత్ కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో సైతం తనకు అచ్చొచ్చిన నవంబర్ నెలలోనే మూడు సెంచరీలు సాధించాడు. దీంతో నవంబర్ మాసం రోహిత్ నామ మాసం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈలెక్కన చూసుకుంటే.. ఈసారి వరల్డ్ కప్ రోహిత్ సారథ్యంలో టీమిండియా కైవసం చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి రోహిత్ నవంబర్ సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.