iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్ కప్.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ICC కీలక నిర్ణయం..

  • Published May 15, 2024 | 9:02 AM Updated Updated May 28, 2024 | 1:32 PM

పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించి ఐసీసీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు. మరి ఐసీసీ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి?

పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించి ఐసీసీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు. మరి ఐసీసీ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి?

టీ20 వరల్డ్ కప్.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్! ICC కీలక నిర్ణయం..

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2024 కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వెస్టిండీస్, అమెరికా దేశాల్లో జరగనున్న ఈ మెగాటోర్నీ జూన్ 1 నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కు సంబంధించిన ఓ కీలక విషయం నెట్టింట వైరల్ గా మారింది. పొట్టి ప్రపంచ కప్ కు సంబంధించి ఐసీసీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు. మరి ఐసీసీ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ మెగాటోర్నీలో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ క్రిక్ బజ్ తన నివేదికలో పేర్కొంది. సాధారణంగా ఐసీసీ మెగాటోర్నీల్లో నాకౌట్ మ్యాచ్ లకు కచ్చితంగా రిజర్వ్ డే ఉంటుంది. వర్షం వచ్చి మ్యాచ్ రద్దైతే.. తర్వాత రోజు మ్యాచ్ ను కొనసాగిస్తారు. అయితే ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ లో సెకండ్ సెమీఫైనల్ కు, ఫైనల్ మ్యాచ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. దాంతో రిజర్వ్ డే కేటాయించలేదని క్రిక్ బజ్ తెలిపింది.

ఇదిలా ఉండగా.. రిజర్వ్ డే బదులుగా అదనంగా 250 నిమిషాల సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. దాంతో ఒకవేళ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించినా.. ఈ సమయాన్ని వాడుకుంటారు. గయానా వేదికగా సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో నాకౌట్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.