SNP
Nicholas Pooran, MLC 2024, MI New York: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ తాజాగా ఓ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
Nicholas Pooran, MLC 2024, MI New York: వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ తాజాగా ఓ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ హంగామా ముగిసిన తర్వాత.. క్రికెట్ అభిమానులను అలరించడానికి అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్, సీటెల్ ఓర్కాస్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సృష్టించిన విధ్వంసంతో ఎంఐకి ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే విజయం దక్కింది. మోరిస్విల్లేలోని చర్చ్ స్ట్రీట్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పూరన్ ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. సీటెల్ బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. ఎంఐ టీమ్‌లోని ప్రధాన బ్యాటర్లు విఫలమైనా.. అతనొక్కడే ఒంటి చేత్తో టీమ్‌ను గెలిపించాడు.
సీటెల్ నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఎంఐ న్యూయార్క్ ఓపెనర్ రూబెన్ 6, పటేల్ 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన నికోలస్ పూరన్‌పై మ్యాచ్ గెలిపించే బాధ్యత పడింది. నాలుగోవ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జహంగీర్ 3, తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన టీమ్ డేవిడ్ 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినా.. పూరన్ ఒక్కడే సీటెల్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచి చివర్లలో ఎంఐ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (8 నాటౌట్) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. పూరన్ ఆడిన ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. అంత కంటే ముందు సీటెల్‌ను ఎంఐ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ ఓ ఆట ఆడుకున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు 19.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో శుభమ్ రంజానే 35, హర్మీత్ సింగ్ 20 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. క్వింటన్ డికాక్, క్లాసెన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కూడా 108కే ఆలౌట్ అయింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. పొలార్డ్ 2, నోర్జే, ఆదిల్ చెరో వికెట్ తీసుకున్నారు. 109 పరుగుల టార్గెట్‌ను ఎంఐ న్యూయార్క్.. పూరన్ విధ్వంసంతో 14.2 ఓవర్లలోనే ఊదిపారేసింది. పూరన్ 62 పరుగులతో వన్‌మ్యాన్ షోతో అలరించాడు. మరి ఈ మ్యాచ్‌లో పూరన్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a stellar 🌟 performance it was! On a pitch that did not look easy to bat on, Nicky P showed them who’s boss 👊 #MLC | #CognizantMajorLeagueCricket | #T20 pic.twitter.com/0661Efdj4K
— Major League Cricket (@MLCricket) July 6, 2024