iDreamPost
android-app
ios-app

NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఇది వరల్డ్ కప్​ను మించిన విక్టరీ!

  • Published Feb 16, 2024 | 3:09 PM Updated Updated Feb 16, 2024 | 3:09 PM

న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు సాధించిన విజయం వరల్డ్ కప్​ను మించినదనే చెప్పాలి. ఇదంతా కేన్ మామ వల్లే సాధ్యమైంది.

న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు సాధించిన విజయం వరల్డ్ కప్​ను మించినదనే చెప్పాలి. ఇదంతా కేన్ మామ వల్లే సాధ్యమైంది.

  • Published Feb 16, 2024 | 3:09 PMUpdated Feb 16, 2024 | 3:09 PM
NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఇది వరల్డ్ కప్​ను మించిన విక్టరీ!

న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఎన్నో ఏళ్ల కలను ఇవాళ నిజం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో నెగ్గిన కివీస్.. ఈ సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్ చేసింది. 92 ఏళ్ల తర్వాత టెస్టుల్లో సఫారీ టీమ్​పై న్యూజిలాండ్ సిరీస్​ నెగ్గింది. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. అందులో కొన్ని సిరీస్​ల్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. కానీ న్యూజిలాండ్ మాత్రం ఒక్కసారి కూడా సిరీస్ నెగ్గలేదు. మ్యాచులు గెలిచినా సిరీస్​ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. వన్డేలు, టీ20ల్లో సఫారీ టీమ్​పై న్యూజిలాండ్​దే హవా. కానీ టెస్టుల్లో మాత్రం సౌతాఫ్రికాదే పైచేయి అవుతూ వచ్చింది. అయితే కేన్ విలియమ్సన్ మహిమతో జట్టు ఎట్టకేలకు చరిత్రను తిరగరాసింది. ​

కేన్ మామ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్లుగా తన జట్టుకు దొరకని సిరీస్​ను అందించాడు. న్యూజిలాండ్​కు అందని ద్రాక్షగా ఉన్న సిరీస్​ను అందించాడు. బ్యాటర్​గా విలియమ్సన్ సూపర్బ్​గా రాణించడంతోనే ఇది సాధ్యమైంది. ఇంజ్యురీతో కొన్నాళ్ల పాటు టీమ్​కు దూరమైన కేన్ మామ.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గత 7 టెస్టుల్లో అతడు ఏకంగా 7 సెంచరీలు బాదడం విశేషం. ఓపిక, టెక్నిక్​కు సవాల్ విసిరే టెస్టుల్లో ఇలా బ్యాక్ టు బ్యాటక్ సెంచరీలు బాదడం అంత ఈజీ కాదు. కానీ విలియమ్సన్ దాన్ని చేసి చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో శతకం బాదాడు. ఇది అతడి కెరీర్​లో 32వ సెంచరీ కావడం విశేషం. అతడు ఎంత భీకరమైన ఫామ్​లో ఉన్నాడనే దానికి ఇదే నిదర్శనం.

సౌతాఫ్రికాతో రెండు మ్యాచుల సిరీస్​లో 118, 109, 43, 133 నాటౌట్ స్కోర్లు చేశాడు విలియమ్సన్. రెండు మ్యాచుల్లో కలిపి ఏకంగా 3 సెంచరీలు బాదాడు. దీన్ని బట్టే సఫారీ బౌలర్లతో అతడు ఎంత చెడుగుడు ఆడుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కేన్ మామ ఫామ్​ను అందుకోవడం, రీఎంట్రీలో అదరగొట్టడం కివీస్​కు సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ఇక, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా 242 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 211 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కివీస్ ముందు ప్రొటీస్ 267 పరుగుల టార్గెట్​ను ఉంచింది. విలియమ్సన్ సెంచరీకి తోడు విల్ యంగ్ (66) రాణించడంతో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇది వరల్డ్ కప్​ను మించిన విజయమని.. సిరీస్ నెగ్గడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు. మరి.. కేన్ మామ కివీస్ కలను నిజం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మద్యం సేవిస్తూ. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన! HCA వేటు..