iDreamPost

మద్యం సేవిస్తూ. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన! HCA వేటు..

Coach Misbehavior with Women Cricketers: దేశంలో ఈ మధ్య క్రీడా రంగానికి చెందిన మహిళలపై కొంతమంది లైంగికంగా వేధింపులు, అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.

Coach Misbehavior with Women Cricketers: దేశంలో ఈ మధ్య క్రీడా రంగానికి చెందిన మహిళలపై కొంతమంది లైంగికంగా వేధింపులు, అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటే ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.

మద్యం సేవిస్తూ. మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన! HCA వేటు..

దేశంలో మహిళలపై రోజు రోజుకీ లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాల పర్వం పెరిగిపోతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు సామాన్యులకే కాదు.. సినీ, క్రీడా, రాజకీయ రంగాల్లో కూడా ఉన్నాయని ఎంతోమంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల భారతదేశంలో వివిధ క్రీడా రంగానికి చెందిన మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఏదో కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది వంకరబుద్ది మారడం లేదు. తాజాగా హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది.. తమ పట్ల కోచ్ అనుచితంగా ప్రవర్తించాడని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ లో మహిళా క్రికెటర్ల పట్ల కోచ్ అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. టీమ్ అంతా బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కోచ్ జై సింహ మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. అసభ్యపదజాలంతో దూషించాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెటర్ల అంతా కలిసి హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. హెడ్ కోచ్ జై సింహతో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమా రావుపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడం పై మహిళా క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ మ్యాచ్ ఆడటం కోసం మహిళల జట్టు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానం రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఫ్లైట్ మిస్ కావడంతో టీమ్ సభ్యులు బస్ లో హైదరాబాద్ కి బయలుదేరారు. ఆ సమయంలో కోచ్ జై సింహ సీటులో మద్యం సేవిస్తూ మహిళా క్రికెటర్లను ఇష్టమొచ్చినట్లుగా బండబూతులు తిట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమ్మాయిలకు గురు స్థానంలో ఉన్న కోచ్ ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై హెచ్‌సీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ కోచ్ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించింది. మరి మహిళా క్రికెటర్ల పట్ల కోచ్ అసభ్యంగా ప్రవర్తించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి