Nidhan
పాకిస్థాన్ క్రికెట్లో నయా సంచలనం. దాయాది జట్టలోకి ఓ కొత్త కుర్రాడు మెరుపులా దూసుకొచ్చాడు. అతడికి ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెట్టేలా ఉన్నాడు.
పాకిస్థాన్ క్రికెట్లో నయా సంచలనం. దాయాది జట్టలోకి ఓ కొత్త కుర్రాడు మెరుపులా దూసుకొచ్చాడు. అతడికి ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెట్టేలా ఉన్నాడు.
Nidhan
పాకిస్థాన్.. ఈ పేరు తలచుకుంటే క్రికెట్లో బౌలర్లే గుర్తుకొస్తారు. ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్.. ఇలా ఎందరో దిగ్గజ పేసర్లను జెంటిల్మన్ క్రికెట్‌కు అందించింది దాయాది దేశం. అందుకే పాక్ బౌలింగ్ ఫ్యాక్టరీగా పేరు గాంచింది. అయితే ఆ దేశం నుంచి ఎందరో మంచి బ్యాట్స్‌మెన్ కూడా వచ్చారనేది గుర్తుంచుకోవాలి. ఇంజమాముల్ హక్, మహ్మద్ యూసుఫ్, యూనిస్ ఖాన్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు తమ బ్యాటింగ్ ప్రతిభతో ఎంతో మంది హార్ట్స్ గెలుచుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పాక్ బ్యాటింగ్‌లో తేలిపోతోంది. మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్ లాంటి ఒకరిద్దరు తప్పితే ఇంటర్నేషనల్ లెవల్లో కన్సిస్టెంట్గా రన్స్ చేస్తున్న మరో బ్యాటర్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తానున్నాంటూ మెరుపులా దూసుకొచ్చాడో యంగ్ క్రికెటర్. అతడే సయీం అయూబ్. సంచలన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడతను.
న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సయీం అయూబ్ సత్తా చాటాడు. కేవలం 8 బంతుల్లోనే 27 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడీ ఓపెనర్. క్రీజులో ఉన్నది కాసేపే అయినా ప్రత్యర్థి జట్టును ఒక రేంజ్లో భయపెట్టాడు. ఆడిన 8 బంతుల్లో 2 బౌండరీలు, 3 సిక్సులు కొట్టాడు. అతడి ఊపు చూస్తే ఈజీగా హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్ అయి క్రీజును వీడాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) ఆకట్టుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ (27 బంతుల్లో 61) చెలరేగిపోయాడు. దీంతో పాక్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది కివీస్. న్యూజిలాండ్ విసిరిన టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది.
కొత్త కుర్రాడు సయీం అయూబ్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్ (14 బంతుల్లో 25) కూడా అటాకింగ్‌కు దిగడంతో 2 ఓవర్లలోనే 30 పరుగులు చేసింది పాక్. ఆ తర్వాత అయూబ్ ఔటైనా బాబర్ ఆజం (57) రాణించడంతో దాయాది జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ వరుసగా వికెట్లు పడటం, మిడిలార్డర్ ఫెయిలవడంతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్‌కు జతగా కనీసం ఒక్క బ్యాటర్ క్రీజులో నిలబడ్డా మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. కానీ మిడిలార్డర్, లోయరార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓటమి తప్పలేదు. పాక్ ఓడినా ఓపెనర్ అయూబ్ ఆడిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. అతడు రనౌట్ కాకపోతే సిచ్యువేషన్ వేరేలా ఉండేదని అంటున్నారు. చెత్త ప్లేయర్లకు బదులు అయూబ్ లాంటి యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇస్తే పాక్ పరువు నిలబెడతాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కివీస్‌పై పాక్ నయా ఓపెనర్ సయీం అయూబ్ ఆడిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన విధ్వంసక బ్యాటర్!
NO LOOK SHOT SAIM AYUB 🔥 pic.twitter.com/teXUtTE3J3
— RAZZAQ-🇵🇰🇸🇦🇵🇸 (@RAZZAQBOBBYSTAN) January 12, 2024
Saim Ayub heroics ends on 27 in just 8 balls.
A promising start by Ayub. pic.twitter.com/UJy0ypLIZO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2024