iDreamPost

Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన విధ్వంసక బ్యాటర్!

  • Published Jan 12, 2024 | 3:58 PMUpdated Jan 12, 2024 | 3:58 PM

భారత క్రికెట్ జట్టుకు గుడ్​న్యూస్. మ్యాచ్ స్వరూపాన్ని సింగిల్ హ్యాండ్​తో మార్చే సత్తా ఉన్న ఓ విధ్వంసక బ్యాటర్ వచ్చేస్తున్నాడు. అతను ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశాడు.

భారత క్రికెట్ జట్టుకు గుడ్​న్యూస్. మ్యాచ్ స్వరూపాన్ని సింగిల్ హ్యాండ్​తో మార్చే సత్తా ఉన్న ఓ విధ్వంసక బ్యాటర్ వచ్చేస్తున్నాడు. అతను ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశాడు.

  • Published Jan 12, 2024 | 3:58 PMUpdated Jan 12, 2024 | 3:58 PM
Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన విధ్వంసక బ్యాటర్!

టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తప్పితే గత కొన్ని నెలల్లో క్రికెట్​లో భారత జట్టు డామినేషన్ మామూలుగా లేదు. ఆసియా కప్-2023 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆసియా కప్ నెగ్గిన రోహిత్ సేన ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాను వన్డే సిరీస్​లో చిత్తు చేసింది. అనంతరం జరిగిన ప్రపంచ కప్​లో రన్నరప్​గా నిలిచింది. ఆ తర్వాత ఆసీస్​తో టీ20 సిరీస్​ను గెలుచుకున్న టీమిండియా.. సౌతాఫ్రికా టూర్​లో ఒక్క ఫార్మాట్​లోనూ సిరీస్ కోల్పోకుండా తిరిగొచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లో కూడా శుభారంభం చేసింది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లండ్​తో 5 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు ఒక గుడ్ న్యూస్. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్న ఓ విధ్వంసర ఆటగాడు గాయం నుంచి కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు.

ఇంజ్యురీ నుంచి రికవర్ అయిన ఆ ప్లేయర్ మరెవరో కాదు.. సూర్యకుమార్ యాదవ్. అవును, మిస్టర్ 360 గాయం నుంచి కోలుకున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్​లో గాయపడ్డాడీ అటాకింగ్ బ్యాటర్. ఇంజ్యురీ కారణంగా ఆఫ్ఘాన్​తో మూడు టీ20ల సిరీస్​కు దూరమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యే టైమ్​కు అతను కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సూర్య వచ్చే ఐపీఎల్​ వరకు ఫిట్​నెస్ సాధించకపోతే క్యాష్ రిచ్​ లీగ్​లోని చాలా మ్యాచులు మిస్ అయ్యే అవకాశం ఉంది. మళ్లీ గాయం తిరగబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి అతడ్ని ఐపీఎల్​లో ఆడించే ఛాన్సులు కూడా కష్టమనే వార్తలు వచ్చాయి. కానీ గాయం నుంచి త్వరగా రికవర్ అయ్యాడీ స్టార్ బ్యాటర్. బ్యాటింగ్​ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేశాడు.

సూర్య బ్యాటింగ్ సాధన చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను స్వయంగా మిస్టర్ 360నే ఇన్​స్ట్రాగ్రామ్​లో షేర్ చేశాడు. తద్వారా తన ఫిట్​నెస్​పై ఎలాంటి అపోహలు వద్దని క్లారిటీ ఇచ్చాడు. సూర్య ఎప్పుడు కోలుకుంటాడోనని టెన్షన్ పడుతున్న అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే సూర్యకుమార్ నేరుగా ఐపీఎల్​లో ఆడతాడా? లేదా ఇంగ్లండ్​తో టెస్టుల్లో ఆడతాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ అయిన అతడికి ఆ మధ్య టెస్టుల్లోనూ ఆడే ఛాన్స్ ఇచ్చింది టీమ్ మేనేజ్​మెంట్. అయితే అనుకున్నంత రేంజ్​లో లాంగ్ ఫార్మాట్​లో సత్తా చాటలేకపోయాడు. అయితే మంచి ఫామ్​లో ఉన్నాడు కాబట్టి అతడ్ని ఇంగ్లీష్ టీమ్​పై ఆడించే అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఏదేమైనా సూర్య కోలుకోవడం భారత జట్టుకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉంది. కాబట్టి హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, మహ్మద్ షమి కూడా కమ్​బ్యాక్ ఇస్తే టీమిండియాకు తిరుగుండదు. మరి.. సూర్య బ్యాటింగ్ ప్రాక్టీస్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: రనౌట్‌ తర్వాత గిల్‌ను పచ్చిబూతులు తిట్టిన రోహిత్‌! స్టంప్‌ మైక్‌ ఆడియో లీక్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి