iDreamPost

బంగ్లాతో మ్యాచ్.. కోహ్లీ సెంచరీకి సాయం చేసింది రాహుల్, అంపైర్ కాదు.. అదేనట!

  • Author Soma Sekhar Updated - 11:01 AM, Sat - 21 October 23

విరాట్ కోహ్లీ సెంచరీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం. అంపైర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి.. విరాట్ సెంచరీకి సాయం చేశాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కోహ్లీ సెంచరీ చేయడానికి కారణం అంపైర్ కాదట.

విరాట్ కోహ్లీ సెంచరీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం. అంపైర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి.. విరాట్ సెంచరీకి సాయం చేశాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కోహ్లీ సెంచరీ చేయడానికి కారణం అంపైర్ కాదట.

  • Author Soma Sekhar Updated - 11:01 AM, Sat - 21 October 23
బంగ్లాతో మ్యాచ్.. కోహ్లీ సెంచరీకి సాయం చేసింది రాహుల్, అంపైర్ కాదు.. అదేనట!

విరాట్ కోహ్లీ సెంచరీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ వీరోచిత శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ సాధించిన శతకంపై తీవ్ర స్థాయిలో దూమారం రేగింది. తన సెంచరీ కోసం టీమ్ విజయాన్ని ఆలస్యం చేశాడని పుజారా షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. అదీకాక అంపైర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి.. విరాట్ సెంచరీకి సాయం చేశాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కోహ్లీ సెంచరీ చేయడానికి కారణం అంపైర్ కాదట. అతడు వైడ్ ఇవ్వకపోవడానికి మరో రీజన్ ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించిన విషయం కంటే.. కోహ్లీ సెంచరీ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అతడి సెంచరీపై తీవ్ర దూమారం రేగుతోంది. టీమిండియా విజయం ఖాయం అవ్వడంతో.. సెంచరీపై ఫోకస్ పెట్టాలని కేఎల్ రాహుల్ సూచించాడు. అయితే అందుకు విరాట్ ముందు ఒప్పుకోకున్నా రాహులే ఒప్పించాడు. ఇదిలా ఉండగా విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో వైడ్ బాల్ ను వైడ్ గా ప్రకటించకుండా కోహ్లీ సెంచరీకి సాయం చేశాడని అందరూ విమర్శించారు.

అయితే అసలు విషయం ఏంటంటే? టీమిండియా రన్ మెషిన్ సెంచరీకి సాయం చేసింది అంపైర్ నిర్ణయం కాదట. మరి ఎవరు? అని మీరు ఆలోచిస్తున్నారా? అసలు విరాట్ శతకానికి సాయం చేసింది క్రికెట్ నియమాలను మార్చే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్(MCC). 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్ వైడ్ విషయంలో పలు మార్పులు చేసింది ఎంసీసీ. ఇలా మార్పులు చేయడానికి కారణం ఏంటంటే? ప్రస్తుత క్రికెట్లో బ్యాటర్లు బౌలర్ బంతి రిలీజ్ చేయకముందే.. అటూ ఇటు కదులుతూ ఉన్నారు. స్వీప్ షాట్, రివర్స్ షాట్ ఆడే ప్రయత్నంలో క్రీజ్ లో ముందుకు వెనక్కి కదులుతుండటంతో.. వారి పక్క నుంచి వెళ్లిన బంతిని వైడ్ ఇవ్వడం కరెక్ట్ కాదని భావించిన ఎంసీసీ ఈ నిబంధనను మార్చింది.

ఈ క్రమంలోనే క్రికెట్ రూల్స్ లోని 22.1 ను సవరించింది. ఇక బౌలర్ రన్నింగ్ ప్రారంభించిప్పుడు బ్యాటర్ మూమెంట్ ఇచ్చి.. మళ్లీ బ్యాటింగ్ పొజిషన్ కు వెళ్లినా.. ముందు ఉన్న చోటునే పరిగణంలోకి తీసుకోవాలని, ఆ ప్లేస్ ను బట్టే వైడ్ నిర్ణయాన్ని ప్రకటించాలని నిబంధనలు మార్చింది. ఇందులో భాగంగానే అంపైర్ ఆ బాల్ ను వైడ్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీ సెంచరీకి సాయం చేసింది కేఎల్ రాహుల్ కాదు, అంపైర్ కాదు.. ఎంసీసీ రూల్స్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరి ఇప్పటికైనా విరాట్ సెంచరీపై చర్చ ఆగుతుందో? లేదో? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి