iDreamPost
android-app
ios-app

World Cup 2023: పాకిస్థాన్‌ను వణికిస్తున్న నెదర్లాండ్స్‌! కుప్పకూలిన టాపార్డర్‌

World Cup 2023: పాకిస్థాన్‌ను వణికిస్తున్న నెదర్లాండ్స్‌! కుప్పకూలిన టాపార్డర్‌

వన్డే వరల్డ్ కప్ సమరం అట్టహాసంగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇంగ్లాండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను 09 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ మట్టికరిపించింది. వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ లోనే గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాగా నేడు నెదర్లాండ్స్, పాకిస్తాన్ మధ్య రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తోంది. పాక్ టాప్ బ్యాట్స్ మెన్ లను తక్కువ స్కోర్ కే పరిమితం చేస్తూ పెవిలియన్ బాట పట్టిస్తోంది. దీంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడినట్లు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉప్పల్ వేదికగా వన్డే ప్రపంచ కప్ లో భాగంగా నెదర్లాండ్స్, పాక్ మధ్య జరుగుతోన్న రసవత్తరంగా మారింది. ముందుగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ తడబాటుకు గురైంది. నెదర్లాండ్ బౌలర్ల దాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పాక్ బ్యాట్స్ మెన్స్ ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం తక్కువ స్కోర్లకే వికెట్ చేజార్చుకున్నారు. ఫఖర్ జమాన్ 15 బంతుల్లో 14 పరుగులు చేసి లగాన్ వాన్ బీక్ బౌలింగ్ లో లగాన్ చేతికి చిక్కాడు.

ఆ తర్వాత ఉల్ హక్ 19 బంతుల్లో 15 పరుగులు చేసి పాల్ వ్యాన్ బౌలింగ్ లో ఆర్యన్ దత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బాబర్ ఆజం 18 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి కోలిన్ బౌలింగ్ లో సాకిబ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. నెదర్లాండ్స్ ఇలాగే కట్టుదిట్టమైన బౌలింగ్ తో పాక్ ను కట్టడి చేస్తే వరల్డ్ కప్ లో మరో సంచలన విజయం నమోదవ్వడం ఖాయమని స్పోర్ట్స్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాక్ 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్ 24 పరుగులు, షకీల్ 23 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.