iDreamPost
android-app
ios-app

T20 World Cup 2024: స్టార్ ప్లేయర్ కు వీసా నిరాకరణ.. వీధుల్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

  • Published May 30, 2024 | 10:31 AM Updated Updated May 30, 2024 | 10:31 AM

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన ఓ స్టార్ ప్లేయర్ కు అమెరికా ఎంబసీ షాకిచ్చింది. అతడికి వీసాను నిరాకరించింది. దాంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. అసలేం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన ఓ స్టార్ ప్లేయర్ కు అమెరికా ఎంబసీ షాకిచ్చింది. అతడికి వీసాను నిరాకరించింది. దాంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. అసలేం జరిగిందంటే?

T20 World Cup 2024: స్టార్ ప్లేయర్ కు వీసా నిరాకరణ.. వీధుల్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

టీ20 వరల్డ్ కప్ 2024.. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం 20 జట్లు ఇప్పటికే వెస్టిండీస్, అమెరికా చేరుకున్నాయి. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ స్టార్ ప్లేయర్ కు వీసాను నిరాకరించింది అమెరికా. దాంతో ఫ్యాన్స్ వీధుల్లోకి ఎక్కి నిరసనలు చేపట్టారు. వెంటనే తమ ఆటగాడికి వీసా మంజూరు చేయాలని రోడ్లపై భారీ ర్యాలీలు చేపట్టారు. మరి వీసా నిరాకరణకు గురైన ఆ ప్లేయర్ ఎవరు? దానికి కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2024 మెగా సమరం కోసం దాదాపు అన్ని జట్లు ఆతిథ్య దేశానికి చేరుకున్నాయి. అయితే ఓ ఆటగాడికి మాత్రం అమెరికా ఎంబసీ వీసాను నిరాకరించింది. దాంతో ఆ దేశ పౌరులు వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీసా నిరాకరించిన ఆ ప్లేయర్ ఎవరో కాదు.. నేపాల్ స్టార్ ప్లేయర్ సందీప్ లామిచానే. నేపాల్ జట్టులో ఇతడు కీలక ఆటగాడు. అమెరికా ఎంబసీ సందీప్ లామిచానేకు వీసా ఇవ్వకుండా అడ్డుకుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్ యువ స్పిన్నర్ సందీప్ లామిచానేకు అమెరికా వీసా నిరాకరించడంతో.. నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లో అభిమానులు వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు. అదేవిధంగా బలువతార్ లోని ప్రధాన మంత్రి నివాసం వద్ద భారీ ఎత్తున నిరసనలు తెలియజేశారు. అతడికి వీసా మంజూరు చేసే విధంగా అమెరికా ఎంబసీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయితే సందీప్ కు వీసా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే? 2022లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని సందీప్ పై కేసు నమోదు అయ్యింది. కేసును పరిశీలించిన ఖాట్మాండ్ జిల్లా కోర్టు.. సందీప్ ను దోషిగా తేలుస్తు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లగా, తీర్పు సందీప్ కు అనుకూలంగా వచ్చింది. ఈ కేసు కారణంగానే అమెరికా అతడికి వీసాను నిరాకరించినట్లు తెలుస్తోంది. మరి నేపాల్ ప్లేయర్ కు వీసా ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.