Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్.. రజత పతకంతో మెరిసిన నీరజ్ చోప్రా!

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్.. రజత పతకంతో మెరిసిన నీరజ్ చోప్రా!

పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న నీరజ్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న నీరజ్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకం సాధించింది. జావెలిన్ త్రోలో స్టార్ ప్లేయర్, గత ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా రజత పతకంతో మెరిశాడు. నీరజ్ ఈ ఈవెంట్ లో కచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తాడు అని అందరూ భావించారు. కానీ, ఫైనల్లో తడబడ్డ అతడు 89.45 మీటర్లు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నాడు. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ సంచలన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ ను ఎగరేసుకుపోయాడు. నీరజ్ సాధించిన పతకంతో భారత్ ఖాతాలో 5 పతకాలు చేరాయి.

పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ గెలుస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా చెలరేగిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ ను ఎగరేసుకుపోయాడు. ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్లు బల్లెం విసరగా.. అర్షద్ ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి సంచలనం సృష్టించాడు. దాంతో పాటుగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇద్దరు కూడా ఫౌల్ అయ్యారు. రెండో ప్రయత్నంలో ఈ గణాంకాలను సాధించారు.

ఇక ఈ ప్రదర్శనతో అర్షద్ ఒలింపిక్ రికార్డులను కూడా  బద్దలు కొట్టాడు. నార్వే అథ్లెట్ ఆండ్రీస్ టోర్కిల్డ్ సన్ 90.57 మీటర్ల దూరం ఇప్పటి వరకు అత్యుత్తమంగా ఉంది. దాన్ని ఈసారి అర్షద్ బ్రేక్ చేశాడు. కాగా.. నీరజ్ సిల్వర్ మెడల్ సాధించడంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య ఐదుకు చేరుకుంది. మరి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా రజతం గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments