సంపదలో భారత స్టార్‌ క్రికెటర్‌ను దాటేసిన నీరజ్‌ చోప్రా! ఏడాదికి ఎంతంటే..?

Neeraj Chopra, Brand Value, Hardik Pandya: ఓ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కంటే.. నీరజ్‌ చోప్రా బ్రాండ్‌ ఎండార్సింగ్‌తో సంపాదించే సంపాదనలో ముందున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Neeraj Chopra, Brand Value, Hardik Pandya: ఓ టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కంటే.. నీరజ్‌ చోప్రా బ్రాండ్‌ ఎండార్సింగ్‌తో సంపాదించే సంపాదనలో ముందున్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఒలింపిక్స్‌లో మెడల్స్‌తో భారత కీర్తి ప్రతిష్టతలను పెంచిన.. ప్రముఖ అథ్లెట్‌, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. సంపాదనలో కూడా తన బళ్లాన్ని చాలా దూరం విసురుతున్నాడు. క్రికెట్‌ను మతంలా, క్రికెటర్లను డెమీ గాడ్స్‌లా భావించే మన దేశంలో.. స్టార్‌ క్రికెటర్లను మించి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇటీవలె ముగిసిన.. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత నీరజ్‌ చోప్రా బ్రాండ్‌ వ్యాల్యూ ఏకంగా 50 శాతం పెరిగినట్లు.. మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. బ్రాండ్‌ వ్యాల్యూ పెరగడంతో పాటు తాను ఎండార్స్‌ చేసే కంపెనీల సంఖ్య కూడా భారీగా పెరగనుంది.

దీంతో.. నీరజ్‌ చోప్రా సంపాదన కూడా అదే రేంజ్‌లో పెరుగుతుందని మనీకంట్రోల్‌ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో జావెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌ గెలవడంతో, తాజాగా ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో సిల్వర్ మెడల్‌ నెగ్గడంతో నీరజ్‌ చోప్రా బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది. గతంలో నీరచ్‌ చోప్రా.. 21 బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా ఉండేవాడు. ఇప్పుడు అతనికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అతనిని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకు రావొచ్చు.

ఈ కంపెనీల సంఖ్య.. 2024 ఏడాది చివరికి 32 నుంచి 34 వరకు ఉండొచ్చని అంచనా వేసింది మనీకంట్రోల్‌ సంస్థ. అయితే.. గతంలో నీరజ్‌ చోప్రా ఒక కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నందుకు ఏడాదికి రూ.3 కోట్లు తీసుకునేవాడు.. ఇప్పుడు అతని బ్రాండ్‌ వ్యాల్యూ పెరగడంతో.. ఏడాది రూ.4.5 కోట్ల నుంచి రూ.5 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. కంపెనీలో పోర్ట్‌ ఫోలియోలో నీరజ్‌ చోప్రా.. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యాను దాటేశాడు. పాండ్యా కంటే ఎక్కువ కంపెనీలకు చోప్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధించడంతో పాటు.. సంపదలో కూడా దూసుకెళ్లున్నాడు నీరజ్‌ చోప్రా. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments