ఐపీఎల్-2023లో బాగా హైలైట్ అయిన అంశాల్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ-లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ ఒకటి. ఇరు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న నవీన్ ఉల్ హక్‌ను కోహ్లీ కవ్వించడం, స్లెడ్జింగ్ చేయడం గురించి తెలిసిందే. కోహ్లీకి నవీన్ దీటుగా బదులివ్వడం.. మ్యాచ్ తర్వాత ఈ విషయంపై విరాట్‌తో లక్నో మెంటార్ గౌతం గంభీర్ బాహాబాహీకి దిగడం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో నవీన్ ఉల్ హక్‌ను, గంభీర్‌ను విరాట్ ఫ్యాన్స్ టార్గెట్ చేసుకొని వాళ్లు కనిపించినప్పుడు అరవడం, రెచ్చగొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలోనూ నవీన్‌ను మ్యాంగో మ్యాన్ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వచ్చారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఒకవేళ ప్లేఆఫ్స్‌కు గనుక వెళ్లుంటే విరాట్-నవీన్ మధ్య మరో ఫైట్ జరిగేదని అప్పట్లో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టారు. ఆసియా కప్-2023లోనైనా నవీన్-కోహ్లీ పోరును చూడాలని ఆశపడ్డారు. కానీ అఫ్గానిస్థాన్ గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. భారత్‌కు ఆ జట్టు ఎదురుపడలేదు. అయినా ఆ టీమ్‌లో నవీన్ ఉల్ హక్కు చోటు దక్కలేదు. దీంతో కోహ్లీ, నవీన్ రైవల్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. అయితే వాళ్లకో గుడ్ న్యూస్.
మ్యాంగో మ్యాన్ నవీన్ ఉల్ హక్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఆసియా కప్-2023లో ఆడిన అఫ్గానిస్థాన్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్‌ను గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్వరలో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్-2023లో తలపడే అఫ్గానిస్థాన్ టీమ్‌కు నవీన్ సెలెక్ట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ ఫ్యాన్స్ కంటే కూడా భారత అభిమానులు, అందులోనూ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా సంతోషడపడుతున్నారు. ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 11వ తేదీన అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ-నవీన్ మధ్య రైవల్రీని, పార్ట్-2ను చూడొచ్చని అంటున్నారు. మరి.. ఈ ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్లో జరిగిన గొడవను మర్చిపోయి బరిలోకి దిగుతారో లేదా ఒకరితో ఒకరు తిరిగి బాహాబాహీకి దిగుతారో చూడాలి.
ఇదీ చదవండి: టీమ్‌లో అతనికి బాధ్యత తెలియడం లేదా?
Naveen Ul Haq added to Afghanistan’s World Cup squad. pic.twitter.com/8GAPwamwvC
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 13, 2023