iDreamPost

టీమ్​లో అతనికి బాధ్యత తెలియడం లేదా? ఇకనైనా మారాలి!

  • Author singhj Published - 04:56 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 04:56 PM, Wed - 13 September 23
టీమ్​లో అతనికి బాధ్యత తెలియడం లేదా? ఇకనైనా మారాలి!

ప్రతిష్టాత్మక ఆసియా కప్​లో భారత జట్టు అదరగొడుతోంది. ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను ఓడిస్తూ దూసుకెళ్తోంది రోహిత్ సేన. సూపర్​-4లో భాగంగా మూడ్రోజుల వ్యవధిలో రెండు మ్యాచ్​లు ఆడిన టీమిండియా.. ఆ రెండింట్లోనూ విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనైతే ఏకంగా 228 రన్స్ తేడాతో గెలిచింది భారత్. రెండో మ్యాచ్​లో లంక నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ 41 రన్స్ తేడాతో గెలిచి ఆసియా కప్​లో ఫైనల్స్​కు చేరుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టుపై చాలా సందేహాలు, అనుమానాలు ఉండేవి. ఆటగాళ్ల ఫామ్​ పైనా ఆందోళన ఉండేది. అవన్నీ పాక్, లంకతో మ్యాచ్​లతో తీరిపోయాయి. కానీ ఒక ప్లేయర్ విషయంలో మాత్రం ఆందోళన వీడటం లేదు. అతడే రవీంద్ర జడేజా.

భారత జట్టులో ఉన్న నాణ్యమైన ఆల్​రౌండర్లలో ఒకడు రవీంద్ర జడేజా. టీమ్ సక్సెస్​లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడీ స్టైలిష్ ప్లేయర్. ఈ ఆసియా కప్​లోనూ బాగానే రాణిస్తున్నాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో కీలకమైన 2 వికెట్లు తీశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా ఈ స్టార్ ప్లేయర్​కు వంక పెట్టడానికి లేదు. అయితే బ్యాటింగ్​లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఈ లెఫ్డాంటెడ్ బ్యాటర్​.. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటిదాకా 181 వన్డేలు ఆడిన జడ్డూ.. కేవలం 2,578 రన్స్ మాత్రమే చేశాడు.

ఈ ఆసియా కప్​లో కూడా బ్యాటింగ్​లో ఫ్లాప్ అవుతున్నాడు జడేజా. గ్రూప్ స్టేజ్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అతడు కేవలం 14 పరుగులు చేసి పెవిలియన్​కు చేరాడు. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో అయితే కేవలం 4 రన్స్​కే వికెట్ సమర్పించుకున్నాడు. కీలకమైన ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగుతున్న జడ్డూ వరుసగా ఫెయిల్ అవుతుండటం ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడాల్సిన సీనియర్ ప్లేయర్ ఇలా ఈజీగా ఔట్ అవ్వడం విమర్శలకు దారితీస్తోంది.

కేవలం బౌలింగ్, ఫీల్డింగ్ ఉంటే చాలు.. బ్యాటింగ్​తో తనకు సంబంధం లేదన్నట్లుగా జడ్డూ వ్యవహరించడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. జడ్డూ ఇకనైనా జట్టులో తన బాధ్యతను గుర్తించి బ్యాటింగ్​లోనూ రాణించాలని కోరుకుంటున్నారు. యువరాజ్ సింగ్ లాంటి ఆల్​రౌండర్లు రాణించడం వల్లే 2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్​లను భారత జట్టు గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు. ప్రపంచ కప్​కు ఎక్కువ సమయం లేనందున జడేజా బ్యాటింగ్ ఫామ్ అందుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని చెబుతున్నారు. మరి.. ఇకనైనా జడ్డూ మారి.. బౌలింగ్, ఫీల్డింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తాడేమో చూడాలి.

ఇదీ చదవండి: భారత్​కు ఎదురుదెబ్బ.. టీమ్​లోకి ఉమ్రాన్ మాలిక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి