Nidhan
Musheer Khan Breaks Sachin Tendulkar's Record: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సంచలనాల పరంపర కొనసాగుతోంది. దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ డే సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సెన్సేషన్.. రెండో రోజు బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు.
Musheer Khan Breaks Sachin Tendulkar's Record: సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సంచలనాల పరంపర కొనసాగుతోంది. దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ డే సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సెన్సేషన్.. రెండో రోజు బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు.
Nidhan
టాలెంట్ ఉన్నవారికి సరైన అవకాశం ఒక్కటి దొరికినా చాలు.. వాళ్లేంటో బయటపడుతుంది. ఇది మరోమారు నిరూపితమైంది. టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ దీన్ని ప్రూవ్ చేశాడు. అన్నలాగే భారత జట్టులోకి రావాలని కలలు కంటున్న ఈ 19 ఏళ్ల కుర్ర క్రికెటర్ అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో భారత్ బీ తరఫున బరిలోకి దిగిన ఈ చిచ్చరపిడుగు టోర్నమెంట్ ఫస్ట్ డేనే సెంచరీతో చెలరేగాడు. అన్న సర్ఫరాజ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, అభిమన్యు ఈశ్వరన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి స్టార్లు ఫెయిలైన చోట పట్టుదలతో ఆడి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తొలి రోజు ప్రకంపనలు రేపిన ఈ యువ కెరటం.. రెండో రోజు కూడా అదే రేంజ్లో ఆడాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ముషీర్ బద్దలు కొట్టిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కెరీర్లో ఫస్ట్ టైమ్ దులీప్ ట్రోఫీలో ఆడుతున్న ముషీర్ తొలి మ్యాచ్‌లోనే భారీ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను ఈ యంగ్ బ్యాటర్ వెనక్కి నెట్టాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో టీనేజ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో ముషీర్ ఖాన్ (181 రన్స్) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు సచిన్ (159 పరుగులు) థర్డ్ ప్లేస్‌లో ఉండగా తాజాగా ముషీర్ అతడ్ని దాటేశాడు. ఈ యువ బ్యాటర్ 19 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించగా.. సచిన్ 18 ఏళ్లు ఉన్నప్పుడు 1991లో వెస్ట్ జోన్ తరఫున ఆడుతూ ఈస్ట్ జోన్‌పై 159 పరుగులు చేశాడు. తాజాగా అతడ్ని ముషీర్ అధిగమించాడు. దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో టీనేజ్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో బాబా అపరాజిత్ (212 పరుగులు) టాప్‌లో ఉన్నాడు.
బాబా అపరాజిత్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఫీట్‌ను చేరుకున్నాడు. 2013లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. అతడి తర్వాతి ప్లేస్‌లో యశ్ ధుల్ (193 పరుగులు) ఉన్నాడు. మూడో స్థానంలోకి ముషీర్ దూసుకొచ్చాడు. అండర్-19 వరల్డ్ కప్‌తో వెలుగులోకి వచ్చిన సర్ఫరాజ్ తమ్ముడు.. దులీప్ ట్రోఫీతో మరోమారు అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి బ్యాటింగ్, క్రేజీ రికార్డులు చూసిన అభిమానులు.. త్వరలో టీమిండియాలో ఎంట్రీ ఖాయమని అంటున్నారు. అన్నకు తగ్గ తమ్ముడిలా ఉన్నాడని మెచ్చుకుంటున్నారు. ఇక, ఇండియా ఏతో మ్యాచ్‌లో రెండో రోజు 105 పరుగులతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముషీర్.. ఓవరాల్‌గా 373 బంతుల్లో 16 బౌండరీలు, 5 సిక్సుల సాయంతో 181 పరుగులు చేశాడు. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీతో కలసి 8వ వికెట్‌కు 204 రన్స్ జోడించాడు. మరి.. ముషీర్ రేర్ ఫీట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.