iDreamPost
android-app
ios-app

Virat Kohli: ట్యాక్స్​ పేయర్స్​లో టాప్​గా నిలిచిన కోహ్లీ.. ఏడాది ఆదాయం ఎంతో తెలుసా?

  • Published Sep 06, 2024 | 7:34 PM Updated Updated Sep 06, 2024 | 7:34 PM

Virat Kohli, Highest-Paid Cricketer, Highest-Paid Athletes: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్జనలో దూసుకెళ్తున్నాడు. క్రికెట్ ఆడటంతో వస్తున్న డబ్బులతో పాటు యాడ్స్, బిజినెస్​ల ద్వారా కూడా భారీగానే వెనకేసుకుంటున్నాడు.

Virat Kohli, Highest-Paid Cricketer, Highest-Paid Athletes: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్జనలో దూసుకెళ్తున్నాడు. క్రికెట్ ఆడటంతో వస్తున్న డబ్బులతో పాటు యాడ్స్, బిజినెస్​ల ద్వారా కూడా భారీగానే వెనకేసుకుంటున్నాడు.

  • Published Sep 06, 2024 | 7:34 PMUpdated Sep 06, 2024 | 7:34 PM
Virat Kohli: ట్యాక్స్​ పేయర్స్​లో టాప్​గా నిలిచిన కోహ్లీ.. ఏడాది ఆదాయం ఎంతో తెలుసా?

క్రికెటర్స్​కు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆడియెన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. ఆన్ ది ఫీల్డ్​తో పాటు ఆఫ్​ ది ఫీల్డ్​లో వాళ్ల లైఫ్​ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ తదితర విశేషాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ల సంపాదన, ఆదాయం లాంటివి కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వివరాలు ఎప్పుడో గానీ బయటకు రావు. తాజాగా ఓ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లలో భారీగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్ల ఆదాయ వివరాలను వెల్లడించింది. ఈ లిస్ట్​లో టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టిన స్పోర్ట్స్​పర్సన్స్​ లిస్ట్​లో అగ్రస్థానంలో నిలిచిన కింగ్.. ఈసారి ఆదాయం జాబితాలోనూ టాప్​లో నిలిచాడు. రూ.66 కోట్లు పన్ను రూపంలో చెల్లించిన కోహ్లీ.. గత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర ఆదాయాన్ని వెనకేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్​వైడ్​గా ఉన్న అథ్లెట్ల ఆదాయం గురించి స్టాటిస్టా ఓ రిపోర్ట్​ను రిలీజ్ చేసింది. ఇందులో కోహ్లీ పేరు కూడా ఉంది. వార్షిక ఆదాయంలో టాప్ ప్లేస్​లో నిలిచాడు కింగ్. గత 12 నెలల్లో అతడు అక్షరాలా రూ.847 కోట్లు ఆర్జించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. హయ్యెస్ట్ పెయిడ్ క్రికెటర్​గా నిలిచిన ఈ భారత బ్యాటర్.. హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ లిస్ట్​లో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో స్టార్ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డో (రూ.2,081 కోట్లు) ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. 2023 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2024 సెప్టెంబర్ 1 మధ్య సంపాదించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లిస్ట్​ను తయారు చేశారు. ప్రముఖ గోల్ఫర్ జాన్ రెహమ్ (రూ.1,712 కోట్లు) టాప్-2లో చోటు దక్కించుకున్నాడు. మరో ఫుట్​బాలర్ మెస్సీ (రూ.1,074 కోట్లు) మూడో స్థానంలో నిలిచాడు.

హయ్యెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ లిస్ట్​లో కోహ్లీ ఒక్కడే క్రికెటర్. మిగతా వాళ్లంతా ఫుట్​బాల్, గోల్ఫ్, బాస్కెట్ బాల్ నేపథ్యం కలిగిన వారే కావడం విశేషం. దీని గురించి తెలిసిన నెటిజన్స్.. కోహ్లీ రేంజ్ ఏంటో ఇది చెబుతోందని అంటున్నారు. అతడు గ్లోబల్ సూపర్​స్టార్ అని.. ఇంత మొత్తంలో ఆదాయం సంపాదించడం అంటే మాటలు కాదని చెబుతున్నారు. అతడు ఇదేరీతిలో మరికొన్నేళ్లు ఆడితే ఈ లిస్ట్​లో ఇంకా పైకి చేరుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక, సంపాదనలో దూసుకెళ్తున్న కోహ్లీ.. భారత జట్టుతో పాటు ఐపీఎల్​లో ఆర్సీబీకి ఆడటం ద్వారా భారీగా ఆర్జిస్తున్నాడు. యాడ్స్ ద్వారా కూడా బిగ్ అమౌంట్​ను వెనకేసుకుంటున్నాడు. క్లోతింగ్ స్టోర్స్, రెస్టారెంట్ బిజినెస్​ల ద్వారా తన ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నాడు. రీసెంట్​గా ఫార్చూన్ ఇండియా వెల్లడించిన రిపోర్ట్​లో కోహ్లీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల ట్యాక్స్ కట్టాడని తేలింది. ఇప్పుడు అతడి వార్షిక ఆదాయం రూ.847 కోట్లు అని బయటపడింది. మరి.. కింగ్ ఆదాయంలో టాప్​లో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.