Nidhan
టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు,
టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ రంజీల్లో దుమ్మురేపుతున్నాడు. ఏకంగా లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు,
Nidhan
వయసు 19 సంవత్సరాలు. కానీ ఆట మాత్రం ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఉంటుంది. అతడి టెక్నిక్, ఫిట్నెస్, పరుగులు చేయాలనే కసి.. ఇలా ఎందులో చూసినా లెజెండరీ క్రికెటర్స్‌ను గుర్తుకు తెస్తున్నాడు. గుర్తుకు తీసుకురావడమే కాదు.. ఏకంగా ఓ దిగ్గజ క్రికెటర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అతడే టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. ఈ టీనేజ్ సంచలనం బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ, ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. రీసెంట్గా జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దుమ్మురేపిన ముషీర్.. ఇప్పుడు రంజీ ట్రోఫీ-2024లోనూ సత్తా చాటుతున్నాడు. ఏకంగా సచిన్ టెండూల్కర్ రికార్డుకే అతడు ఎసరు పెట్టాడు.
విదర్భతో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్ రెచ్చిపోయి ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులే చేసి ఔటైన ఈ యువ తరంగం.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన సెంచరీతో గర్జించాడు. 326 బంతులు ఎదుర్కొన్న అతడు 136 పరుగులు చేశాడు. సాధారణంగా క్విక్‌గా రన్స్ చేసే ముషీర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా ఓపిగ్గా ఆడాడు. వికెట్ల మీద కుదురుకోవడం మీదే ఫోకస్ చేశాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత కూడా స్ట్రయిక్ రొటేషన్ చేస్తూ సీనియర్ బ్యాటర్లు అజింక్యా రహానె (73), శ్రేయస్ అయ్యర్ (95) లాంటి వాళ్లు అటాక్ చేసి ఆడేలా ప్రోత్సహించాడు. ఒకవైపు ముషీర్ వికెట్లకు అడ్డంగా నిలబడటం వల్లే.. ఇంకోవైపు మిగిలిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు.
ఫైనల్ మ్యాచ్‌లో ముషీర్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ స్పెషల్‌గా గుర్తుండిపోతుందనే చెప్పాలి. ఈ సెంచరీతో అతడు చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన ముంబై క్రికెటర్‌గా ముషీర్ రికార్డు క్రియేట్ చేశాడు. 19 ఏళ్ల 14 రోజుల వయసులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు ముషీర్. కాగా, ఇప్పటిదాకా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ పేరిట ఈ రికార్డు ఉండేది. 1994-95 రంజీ సీజన్ ఫైనల్లో 21 ఏళ్ల 11 నెలల వయసులో మాస్టర్ బ్లాస్టర్ శతకం బాదాడు. కాగా, విదర్భకు ముంబైకి మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను సచిన్ ప్రత్యక్షంగా స్టాండ్స్‌లో నుంచి వీక్షించాడు. ఆయన ముందే ముషీర్ ఈ ఘనత సాధించడం విశేషం. సచిన్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈ మ్యాచ్ కోసం వాంఖడేకు వచ్చారు. మరి.. సచిన్ రికార్డును సర్ఫరాజ్ సోదరుడు బద్దలు కొట్టడం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అయ్యర్ బ్యాటింగ్ విధ్వంసం.. బీసీసీఐ దెబ్బకు సెట్టయ్యాడు!
HUNDRED IN RANJI TROPHY FINAL….!!!!
– Musheer Khan is just 19 years old. 🤯🔥pic.twitter.com/2xfxleYI9R
— Johns. (@CricCrazyJohns) March 12, 2024
Sachin Tendulkar’s presence inspired Musheer Khan to a century in the Ranji Trophy final 🤩https://t.co/ErrgRPiUpf | #RanjiTrophyFinal pic.twitter.com/HfpczQzkYE
— ESPNcricinfo (@ESPNcricinfo) March 12, 2024