iDreamPost

అయ్యర్ బ్యాటింగ్ విధ్వంసం.. బీసీసీఐ దెబ్బకు సెట్టయ్యాడు!

  • Published Mar 12, 2024 | 5:24 PMUpdated Mar 12, 2024 | 5:24 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు. ఎట్టకేలకు అతడి బ్యాట్ గర్జించింది.

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు. ఎట్టకేలకు అతడి బ్యాట్ గర్జించింది.

  • Published Mar 12, 2024 | 5:24 PMUpdated Mar 12, 2024 | 5:24 PM
అయ్యర్ బ్యాటింగ్ విధ్వంసం.. బీసీసీఐ దెబ్బకు సెట్టయ్యాడు!

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్​లో విధ్వంసక ఇన్నింగ్స్​తో అందరి ఫోకస్ తనపై పడేలా చేశాడు. గత కొన్నాళ్లుగా అనవసర వివాదంతో అయ్యర్ వార్తల్లో ఒకడిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్​తో టెస్టుల్లో పూర్ ఫామ్​తో రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డ ఈ బ్యాటర్​ను పూర్తి సిరీస్​కు సెలక్ట్ చేయలేదు. దీంతో సిరీస్ మధ్యలోనే బెంగళూరులోని ఎన్​సీఏకు అతడు వెళ్లిపోయాడు. నేషనల్ డ్యూటీలో లేడు కాబట్టి రంజీ ట్రోఫీలో ఆడమని అతడికి బీసీసీఐ సూచించింది. కానీ గాయం సాకు చూపి ఎన్​ఏసీలోనే ఉండిపోయాడు అయ్యర్. దీంతో అతడి కాంట్రాక్ట్​ను బోర్డు రద్దు చేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మెరుపు ఇన్నింగ్స్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు అయ్యర్.

విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్​లో 7 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు అయ్యర్. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే రెండో ఇన్నింగ్స్​లో మాత్రం 111 బంతుల్లో 95 పరుగులు చేసి సత్తా చాటాడతను. అతడు చేసిన పరుగుల్లో దాదాపు 60 బౌండరీలు, సిక్సుల ద్వారానే వచ్చాయి. 10 ఫోర్లు బాదిన అయ్యర్.. 3 సిక్సులు కొట్టాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్ (136), కెప్టెన్ అజింక్యా రహానె (73), షామ్స్ ములానీ (50 నాటౌట్) రాణించడంతో ముంబై రెండో ఇన్నింగ్స్​లో 418 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫైనల్​లో గెలవాలంటే విదర్భ 537 పరుగులు చేయాల్సి ఉంటుంది. అదే ముంబై నెగ్గాలంటే 10 వికెట్లు తీయాలి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్​లో ముంబై విజయం నల్లేరు మీద నడకేలా అనిపిస్తోంది.

ఇక, విదర్భపై సెన్సేషనల్ నాక్ ఆడిన అయ్యర్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. తన బ్యాట్ పవర్ ఏంటో అతడు చూపించాడని అంటున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం బీసీసీఐ దెబ్బతో అతడు సెట్టయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్​నెస్ కాపాడుకోవడంతో పాటు పరుగులు చేస్తేనే టీమ్​లో ప్లేస్ ఉంటుందని, ఎంతటి స్టార్ అయినా బోర్డు మాట వినక తప్పదని చెబుతున్నారు. అయితే అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం ఈ స్టార్ బ్యాటర్ గతేడాది వరల్డ్ కప్​కు ముందు నుంచే గాయంతో బాధపడుతున్నాడని అంటున్నారు. ఇంజ్యురీ కారణంగానే లాస్ట్ ఐపీఎల్​ను వదులకున్నాడని, దేశం కోసం నొప్పిని భరిస్తూనే వరల్డ్ కప్​లో బరిలోకి దిగాడని చెబుతున్నారు. ఇప్పటికి కూడా ఏదీ ముగిసిపోలేదని.. డొమెస్టిక్​ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లోనూ సత్తా చాటి త్వరలో టీమిండియాలోకి అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అయ్యర్ బ్యాటింగ్ విధ్వంసం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి