iDreamPost
android-app
ios-app

Hardik Pandya: హార్దిక్ అద్భుతమైన కెప్టెన్.. అందరికంటే డిఫరెంట్.. ప్రశంసలు కురిపించిన పేస్ గన్!

  • Published May 12, 2024 | 12:54 PM Updated Updated May 12, 2024 | 12:54 PM

హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అని, అతడు అందరికంటే డిఫరెంట్ అని ఆకాశానికి ఎత్తేశాడు ఓ యంగ్ పేస్ గన్. అందరూ పాండ్యాను విమర్శిస్తుంటే.. ప్రశంసించిన ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అని, అతడు అందరికంటే డిఫరెంట్ అని ఆకాశానికి ఎత్తేశాడు ఓ యంగ్ పేస్ గన్. అందరూ పాండ్యాను విమర్శిస్తుంటే.. ప్రశంసించిన ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: హార్దిక్ అద్భుతమైన కెప్టెన్.. అందరికంటే డిఫరెంట్.. ప్రశంసలు కురిపించిన పేస్ గన్!

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలకలా తయ్యారైంది’. టీమ్ లో ఉందమంటే? విమర్శలు. బయటకి వద్దామా? అంటే పరువుపోతుందన్న భయం. ఇలాంటి సంకట స్థితిలో పాండ్యా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే పాండ్యాను విమర్శించే వారితో పాటుగా అతడికి మద్ధతుగా నిలిచి, ప్రశంసించే వారు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఓ యంగ్ పేస్ గన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అని, అతడు అందరికంటే డిఫరెంట్ అని ఆకాశానికి ఎత్తేశాడు.

ఐపీఎల్ 2024 కోసం రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా వచ్చిన హార్దిక్ పాండ్యా తన మార్క్ ను చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. దాంతో ఈ సీజన్ లో ముంబై ఆడిన 12 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలిచి.. ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. వరుసగా ఓడిపోతున్నప్పటి నుంచే పాండ్యాపై మాజీ క్రికెటర్లతో పాటుగా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యా కెప్టెన్సీ బాలేదని, అహంకారపూరితంగా నాయకత్వం చేస్తున్నాడని మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యంగ్ పేసర్ గెరాల్డ్ కోయోట్జీ పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

“హార్దిక్ పాండ్యా ఓ అద్భుతమైన కెప్టెన్. గొప్ప నాయకుడికి ఉన్న లక్షణాలు అన్నీ అతడిలో ఉన్నాయి. ఇక గ్రౌండ్ లో వ్యూహాలు రచించడంలో అతడు సిద్దహస్తుడు. అయితే ప్రతి ఒక కెప్టెన్ కు ఒక స్టైల్ ఉంటుంది. అందరూ ఒకేలా నాయకత్వ లక్షణాలు కలిగిఉండరు. పాండ్యా డిఫరెంట్. టీమ్ లో ప్రతి ప్లేయర్ కు పాండ్యా సపోర్ట్ గా ఉంటాడు. ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి గొడవలు లేవు. కానీ ఎందుకో ఈ సీజన్ లో పాండ్యా తన మార్క్ ను చూపించడంలో విఫలం అయ్యాడు” అంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కొయెట్జీ.