iDreamPost
android-app
ios-app

పేస్, బౌన్స్, స్వింగ్ లేని పిచ్​పై బ్యాటర్లను వణికించాడు! ఎవరీ అన్షుల్ కాంబోజ్?

  • Published Sep 14, 2024 | 4:47 PM Updated Updated Sep 14, 2024 | 4:47 PM

Anshul Kamboj 5 Wickets Haul In Duleep Trophy: పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్​పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే పిచ్ నుంచి ఏమాత్రం హెల్ప్ దొరకకపోయినా వికెట్లు తీయడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నాడు ఓ ముంబై ఇండియన్స్ బౌలర్.

Anshul Kamboj 5 Wickets Haul In Duleep Trophy: పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్​పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే పిచ్ నుంచి ఏమాత్రం హెల్ప్ దొరకకపోయినా వికెట్లు తీయడం కొందరికే సాధ్యం. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నాడు ఓ ముంబై ఇండియన్స్ బౌలర్.

  • Published Sep 14, 2024 | 4:47 PMUpdated Sep 14, 2024 | 4:47 PM
పేస్, బౌన్స్, స్వింగ్ లేని పిచ్​పై బ్యాటర్లను వణికించాడు! ఎవరీ అన్షుల్ కాంబోజ్?

పేస్, బౌన్స్, స్వింగ్ ఉన్న పిచ్​పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకుంటారు. అయితే జీవం లేని పిచ్​లు కనిపిస్తే మాత్రం భయపడిపోతారు. పిచ్ నుంచి హెల్ప్ దొరక్కపోతే వికెట్లు పడగొట్టడం అంత ఈజీ కాదు. అందునా సవాల్ విసిరే టెస్టుల్లో నిర్జీవమైన పిచ్​ల మీద వికెట్లు తీయడం ఎంతటి తోపు పేసర్​కైనా కష్టమే. కానీ కొందరు మాత్రం ఈ పనిలో స్పెషలిస్ట్​లుగా పేరు తెచ్చుకున్నారు. కండీషన్స్​కు భయపడకుండా బ్యాటర్ల వీక్​నెస్, తమ స్ట్రెంగ్త్​ను నమ్ముకొని పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో బంతులు వేస్తూ బ్యాటర్లను వణికిస్తుంటారు. అలాంటి అరుదైన పెర్ఫార్మెన్స్​తో ఆకట్టుకున్నాడో ముంబై ఇండియన్స్ బౌలర్. అతడే అన్షుల్ కాంబోజ్. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో స్టన్నింగ్ స్పెల్​తో అందర్నీ ఇంప్రెస్ చేశాడీ పేసర్. స్టార్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు.

దులీప్ ట్రోఫీలో ఇండియా-సీ తరఫున బరిలోకి దిగిన అన్షుల్ కాంబోజ్.. ఇండియా-బీతో మ్యాచ్​లో సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టు టాప్-5 బ్యాటర్లను అతడే పెవిలియన్​కు పంపించాడు. ఇండియా-బీ ఓపెనర్ నారాయణ్ జగదీషన్​తో పాటు స్టార్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, రింకూ సింగ్, నితీష్​ కుమార్ రెడ్డిని ఔట్ చేసి చావుదెబ్బ తీశాడీ రైటార్మ్ పేసర్. ఇందులో రెండు వికెట్లు ఎల్బీడబ్ల్యూ ద్వారా వచ్చినవే. ముషీర్, సర్ఫరాజ్​ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అన్షుల్.. నితీష్ రెడ్డిని క్లీన్​ బౌల్డ్ చేశాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​ను పట్టుకొని అందులోనే బాల్స్ వేస్తూ పోయాడతను. బ్యాటర్ల బలహీనతలను టార్గెట్ చేస్తూ ఫలితాలు రాబట్టాడు. పిచ్ నుంచి బౌన్స్, పేస్​కు సహకారం లేకపోయినా.. బాల్ స్వింగ్ అవ్వకున్నా ఓపికతో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశాడు. అతడి నమ్మకం, కష్టం వృథా పోలేదు. 5 వికెట్లు ఖాతాలో పడ్డాయి. సర్ఫరాజ్, రింకూ, నితీష్​, ముషీర్ లాంటి స్టార్లను భయపెట్టిన ఈ కుర్ర బౌలర్ గురించి మరింత తెలుసుకుందాం..

23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్​ సొంత రాష్ట్రం హరియాణా. ఈ ఏడాది ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్​కు ఆడటం ద్వారా అతడు వెలుగులోకి వచ్చాడు. ఈ సీజన్​లో ఎంఐ తరఫున అరంగేట్రం చేసిన రెండో భారతీయ బౌలర్​ కాంబోజే. గతంలో అండర్-19లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్​లతో దుమ్మురేపాడతను. ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు. 10 మ్యాచుల్లో 17 వికెట్లతో తన టాలెంట్ ఏంటో అందరీకి చూపించాడీ రైటార్మ్ పేసర్. అలా ఐపీఎల్​లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఓవరాల్​గా ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో ఆడిన 14 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. లిస్ట్​ ఏలో 15 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ పెర్ఫార్మెన్స్​తో మరోమారు అందరి ఫోకస్ తన మీద పడేలా చూసుకున్నాడు. మరి.. అన్షుల్ కాంబోజ్ ఫైరింగ్​ స్పెల్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.