iDreamPost
android-app
ios-app

రోహిత్​ను కొట్టేటోడు లేడు.. ధోని, కోహ్లీ కంటే అతడే గ్రేట్: యువరాజ్

  • Published Sep 14, 2024 | 3:37 PM Updated Updated Sep 16, 2024 | 3:08 PM

Yuvraj Singh Says Rohit Sharma Is His Favorite Batsman: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంతో మంది స్టార్ ప్లేయర్లతో కలసి ఆడాడు. పలువురు దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. అయితే అందులో ఒకరి బ్యాటింగ్ అంటే తనకు పిచ్చి అని అంటున్నాడు.

Yuvraj Singh Says Rohit Sharma Is His Favorite Batsman: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంతో మంది స్టార్ ప్లేయర్లతో కలసి ఆడాడు. పలువురు దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. అయితే అందులో ఒకరి బ్యాటింగ్ అంటే తనకు పిచ్చి అని అంటున్నాడు.

  • Published Sep 14, 2024 | 3:37 PMUpdated Sep 16, 2024 | 3:08 PM
రోహిత్​ను కొట్టేటోడు లేడు.. ధోని, కోహ్లీ కంటే అతడే గ్రేట్: యువరాజ్

టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ సుదీర్ఘ కెరీర్​లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లతో కలసి ఆడాడు. పలువురు దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు కొందరు అత్యుత్తమ క్రికెటర్లతో అతడు కలసి ఆడాడు. వాళ్లతో కలసి బ్యాటింగ్​కు దిగుతూ పరుగుల వరద పారించాడు. సచిన్, కోహ్లీనే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, గౌతం గంభీర్ ఇలా ఎందరో టాప్ బ్యాటర్స్​తో కలసి ఆడాడు. అయితే వీళ్ల కంటే తనకు మరో బ్యాటర్ ఆట అంటేనే పిచ్చి అని అంటున్నాడు. అతడు ఆడుతుంటే జస్ట్ అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుందని చెబుతున్నాడు. ధోని, కోహ్లీ కంటే అతడే తోపు అని.. అతడ్ని కొట్టేటోడు లేడని అంటున్నాడు యువీ. ఈ లెజెండ్​కు ఇంతగా నచ్చేసిన ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫేవరెట్ బ్యాటర్ అని రివీల్ చేశాడు యువరాజ్. అతడి గేమ్​కు తాను బిగ్ ఫ్యాన్​నని చెప్పాడు. అతడు ఆడుతుంటే చూడటం ఎంతో గొప్పగా ఉంటుందన్నాడు. హిట్​మ్యాన్​ను బ్యాటింగ్​లో కొట్టేటోడు లేడని.. అతడి బ్యాటింగ్ తన శైలిని పోలి ఉంటుందన్నాడు యువీ. జీవితాంతం రోహిత్​ బ్యాటింగ్ చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుందని, అతడు అంత అలవోకగా, అద్భుతంగా ఆడతాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఒక స్పోర్ట్స్​ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ కామెంట్స్ చేశాడు. తన బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్​గా చెప్పలేనని.. బహుశా హిట్టర్​ను అనుకుంటానన్నాడు. కానీ రోహిత్, తాను ఒకేలా ఆడుతున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఇక, హిట్​మ్యాన్​తో యువీకి మంచి అనుబంధం ఉంది. 2011 వరల్డ్ కప్ టైమ్​లో అతడి కెరీర్ పీక్​లో ఉంది. కానీ ఆ సమయంలో రోహిత్ జట్టులో చోటు దక్కక ఇబ్బంది పడ్డాడు.

వన్డే ప్రపంచ కప్-2011కు రోహిత్​ సెలెక్ట్ అవలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఒకవైపు అధిక బరువు, ఫిట్​నెస్ సమస్యలు, బ్యాటింగ్ ఫెయిల్యూర్.. మరోవైపు వరల్డ్ కప్​ టీమ్​కు సెలెక్ట్ కాకపోవడంతో అతడు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో అతడికి అండగా నిలిచాడు యువీ. రోహిత్ టాలెంట్ ఏంటో అతడికి గుర్తుచేశాడు. కెరీర్​లో ఎదగాలంటే ఫిట్​నెస్, బ్యాటింగ్ టెక్నిక్​లో చేయాల్సిన మార్పులను సూచించాడు. డిన్నర్​కు తీసుకెళ్లి అతడ్ని కూల్ చేశాడు. ఆ తర్వాత క్రమంగా కెరీర్​పై ఫోకస్ పెంచిన హిట్​మ్యాన్.. మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ-2013 నుంచి అతడి దశ తిరిగింది. పదేళ్లు తిరిగేసరికి టీ20 వరల్డ్ కప్​ విన్నింగ్ కెప్టెన్​గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్ గురించి యువీ పైవ్యాఖ్యలు చేశాడు. మరి.. మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరు? ఎవరి బ్యాటింగ్ జీవితాంతం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందో కామెంట్ చేయండి.