iDreamPost
android-app
ios-app

MS Dhoni 42nd Birthday: ధోని బర్త్ డే గిఫ్ట్ గా భారీ కటౌట్.. తెలుగోడి వీరాభిమానం!

  • Author Soma Sekhar Published - 12:03 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 12:03 PM, Thu - 6 July 23
MS Dhoni 42nd Birthday: ధోని బర్త్ డే గిఫ్ట్ గా భారీ కటౌట్.. తెలుగోడి వీరాభిమానం!

అతడి రాక టీమిండియాకు ఓ వరం.. దిగజారిపోతున్న భారత క్రికెట్ కు దారి చూపిన సూర్యుడు అతడు. ఓడిపోయే మ్యాచ్ లు కూడా గెవొచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పిన అసలైన సారథి తను. ఇక టీమిండియా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన యోధుడు అతడు.. అతడే మహేంద్రసింగ్ ధోని. తన పదునైన వ్యూహాలతో, తన ఫినిషింగ్ ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. దాంతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడీ మహేంద్రుడు. తాజాగా జూలై 7న 42వ పడిలోకి అడుగుపెడుతున్న ధోనికి తెలుగు అభిమానులు అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేశారు. మిస్టర్ కూల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రత్యేక బహుమతిని ప్లాన్ చేశారు.

టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. జూలై 7న 42వ ఏట అడుగుపెడుతున్నాడు. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న ధోని ఫ్యాన్స్.. తమ అభిమాన ఆటగాడి బర్త్ డేను స్పెషల్ గా జరుపుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేంద్రసింగ్ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద 52 అడుగుల ధోని భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. మిస్టర్ కూల్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ భారీ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు ఫ్యాన్స్. ధోని గ్రౌండ్ లోకి వస్తున్న ఫొటోతో ఈ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో సైతం ధోని భారీ కటౌట్ నెట్టింట వైరల్ గా మారింది. నందిగామలో ధోని ఫ్యాన్స్ 77 అడుగుల అతి భారీ కటౌన్ ను ఏర్పాటు చేస్తున్నారు. దాంతో నందిగామలో అతిపెద్ద క్రికెటర్ కటౌట్ గా ఈ కటౌట్ చరిత్రలో నిలవనుంది. అయితే ధోనికి కటౌట్ లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు ఏర్పాటు చేయగా.. అడుగుల విషయంలో మాత్రం ఈ రెండు కటౌట్లే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా.. ధోని బర్త్ డే సందర్భంగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ధోని బయోపిక్ అయిన ధోని అన్ టోల్డ్ స్టోరీ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. దాంతో ధోని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరి ధోని ఫ్యాన్స్ ఇంత పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.