సొంత ఊరులో ధోని సందడి.. మహిళ పాదాలకు నమస్కారం..

మహేంధ్ర సింగ్ ధోని సొంత ఊరులో సందడి చేశారు. భార్య సాక్షితో కలిసి తమ ఉత్తరాఖండ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మహేంధ్ర సింగ్ ధోని సొంత ఊరులో సందడి చేశారు. భార్య సాక్షితో కలిసి తమ ఉత్తరాఖండ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు తెలియని వ్యక్తంటూ బహుషా ఎవరూ ఉండరేమో. క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ధోని. వరల్డ్ వైడ్ గా ధోనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. టీమిండియా కెప్టెన్ గా ఉన్న సమయంలో జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు. భారత జట్టుకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించారు ఈ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో అయినా కూల్ గా వ్యవహరించి సహచర ఆటగాళ్లకు సూచనలు చేస్తూ జట్టుకు విజయం అందించడంలో ఆయనకు మరెవరు సాటిరారు. కాగా ఈ లెజెండ్ క్రికెటర్ తాజాగా తన సొంత ఊరిలో సందడి చేశారు. భార్యతో కలిసి సొంత ఊరిలో పర్యటించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఎంత ఎదిగినా ఒదిగుండే లక్షణం ధోని సొంతం. దేశం గర్వించే స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో మహి ఒకరు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ధోని ఓ సాధారణ వ్యక్తిలాగా ఓ మహిళ కాళ్లకు నమస్కరించారు. ఆమె ఆత్మీయ పలకరింపుకు ముగ్దుడైన ధోని ఆమె నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. తన భార్య సాక్షితో కలిసి ధోని బుధవారం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. తమ పూర్వీకులు నివసించిన ఆల్మోరా గ్రామాన్ని సందర్శించి సందడి చేశారు. దిగ్గజ క్రికెటర్ తమ విలేజ్ కు వస్తున్నాడని తెలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులతో మమేకమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసిపోయారు.

ఈ సందర్భంగా అరుదైన దృష్యం ఆవిష్కృతమైంది. ధోనితో ఆత్మీయంగా కాసేపు ముచ్చటించిన మహిళ కాళ్లకు నమస్కరించారు. దీంతో మురిసిపోయిన ఆ మహిళ ఆనందంతో మహిని ఆలింగనం చేసుకుంది. ఇది చూసిన ధోని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధోనిని ఇంతలా ప్రేమించడానికి కారణం ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా 1970లలో ధోని తండ్రి పాన్‌ సింగ్‌ ఉద్యోగరీత్యా ఉత్తరాఖండ్‌ నుంచి రాంచికి వలస వచ్చారని సమాచారం. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మెరిసిన ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ కు ఐదవ టైటిల్ ను అందించారు.

Show comments