iDreamPost
android-app
ios-app

ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు! స్పాట్‌లోనే..

  • Published Nov 04, 2024 | 3:33 PM Updated Updated Nov 04, 2024 | 3:33 PM

Uttarakhand Bus Accident: గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

Uttarakhand Bus Accident: గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.

ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు! స్పాట్‌లోనే..

ఈ మధ్య కాలంలో నిత్యం పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం,అవగాణ లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క క్షణం ఏమరపాటు వల్ల ఎన్నో జీవితాలు రోడ్డుపాలవుతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా డ్రైవర్లలో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. దేవిభూమి ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాల్లోని మార్చుల వద్ద బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో 36 మంది మరణించినట్లు విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. అల్మోరా జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

గర్వాల్ నుంచి కుమాపూ వెళుతున్న బస్సు మార్చులా వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 200 అడుగుల లోయలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది అక్కడిక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులను కాపాడేందుకు విపరీతంగా శ్రమించారు. గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 16 మంది పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో ఈ ఘటనలో మొత్తం 36 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. ప్రభుత్వం తరుపున ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పును సాయం చేస్తామని ప్రకటించారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్షతగాత్రులను తరలించడానికి, మెరుగైన చికిత్స కోసం ఎయిల్ లిఫ్ట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషాద ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కమిషన్ కుమాన్ డివిజన్ కు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించారు. పౌరీ-అల్మోరా సంబంధింత ప్రాంతం ఆర్టీఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ఓవర్ లోడ్ కారణంగానే డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో లోయలో పడిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లోయ ప్రాంతాల్లో బస్సులు, ఇతర వాహనాలు ప్రయాణించే సమయంలో ఓవర్ లోడ్ లేకుండా చూసుకోవాలి. వాహనాలను ముందుగానే చెక్ చేసుకొవాలి, మలుపుల వద్ద డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయాలి. వీటన్నింటిని సరైన పద్దతిలో పాటించకపోవడం వల్లనే తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.