iDreamPost
android-app
ios-app

జైల్లో రామాయణం నాటకం.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన ఖైదీలు!

  • Published Oct 13, 2024 | 1:41 PM Updated Updated Oct 13, 2024 | 1:41 PM

Prisoners: నేరాలకు పాల్పపడిన వారికి జైలు శిక్ష విధిస్తుంటారు. జైలు జీవితం గడపలేక కొంతమంది పారిపోతుంటారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ ఇద్దరు ఖైదీలు పోలీసులకు, ఖైదాలకు షాక్ ఇచ్చారు.

Prisoners: నేరాలకు పాల్పపడిన వారికి జైలు శిక్ష విధిస్తుంటారు. జైలు జీవితం గడపలేక కొంతమంది పారిపోతుంటారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ ఇద్దరు ఖైదీలు పోలీసులకు, ఖైదాలకు షాక్ ఇచ్చారు.

జైల్లో రామాయణం నాటకం.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన ఖైదీలు!

సినిమాల్లో జైల్లో కొన్ని కామెడీ సీన్లు చూస్తుంటే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. జైలు నుంచి ఖైదీలు రక రకాల పన్నాగాలు పన్ని తప్పించుకుంటారు. అచ్చం సినిమా స్టైల్లో ఇద్దరు దొంగలు పారిపోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. విచిత్రం ఏంటంటే చుట్టూ ఖైదీలు, పోలీసులు ఉన్నా కూడా ఆ ఇద్దరు దొంగలు చాకచక్యంగా జైలు నుంచి పారిపోవడం పోలీసులు, తోటి ఖైదీలు సైతం షాక్ కి గురయ్యారు. ఇంతకీ ఆ దొంగలు ఎలా తప్పించుకున్నారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

జైలు నుంచి ఇద్దరు కరడు గట్టిన ఖైదాలు పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకున్నారు. చుట్టూ జైలు అధికారులు, ఖైదీలు ఉండగానే వాళ్ల అందరి ఎదురుగానే 20 అడుగులు గోడ దూకి పారిపోయారు. ఉత్తరాఖండ్ లోని రోషనాబాద్ జైలులో ‘రామాయణం’నాటకం ఆడుతూ పారిపోయినట్లు తెలుస్తుంది. విజయదశమి సందర్భంగా జైలులో ఖైదీలతో రామాయణం నాటకం ఏర్పాటు చేశారు జైలు అధికారులు. వేధికపై నాటకం రసవత్తరంగా సాగుతుంది. ఇదే అదునుగా ఇద్దరు ఖైదీలు ఎస్కేప్ కావడానికి పక్కా స్కెచ్ వేశారు.  ఇద్దరు ఖైదీలు పంకజ్, రాజ్ కుమార్ వానర పాత్రలు వేశారు. పోలీస్ అధికారుల, ఖైదీలో నాటకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

నాటకం మధ్యలో  ఇద్దరు ఖైదీలు సీతను వెతికే క్రమంలో 20 అడుగుల జైలు గోడపై నుంచి దూకి పరారయ్యారు. గోడ దూకి పారిపోయిన ఇద్దరు ఖైదలు ఎంత సేపటి రాకపోవడంతో   అసలు విషయం అర్థం చేసుకున్న పోలీసులు వెంటనే ఖైదీలను వెతికే పనిలో పడ్డారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా, రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పై సీరియస్ అయిన ఉన్నతాధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఖైదీల కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు.