iDreamPost
android-app
ios-app

MS Dhoni Fan: ఆత్మహత్య చేసుకున్న ధోని వీరాభిమాని.. కారణం ఏంటంటే?

  • Published Jan 19, 2024 | 4:50 PM Updated Updated Jan 19, 2024 | 4:50 PM

తన ఇంటినే ధోని నిలయంగా మార్చుకున్న ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ధోని అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

తన ఇంటినే ధోని నిలయంగా మార్చుకున్న ఓ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ధోని అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

MS Dhoni Fan: ఆత్మహత్య చేసుకున్న ధోని వీరాభిమాని.. కారణం ఏంటంటే?

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఓ వీరాభిమాని ఉన్నాడు. అతడి పేరు గోపీ కృష్ణ(34). తమిళనాడుకు చెందిన గోపీ కృష్ణకు ధోని అంటే ఎంతో ఇష్టం.. పిచ్చి ప్రేమ. అందుకే తన ఇంటిని చెన్నై సూపర్ కింగ్స్ కలర్, ధోని పెయింటింగ్స్ లతో నింపేశాడు. ఎంతో ఇష్టంతో, కోరికతో తన ఇంటిని ‘హోం ఆఫ్ ధోని ఫ్యాన్’ గా మార్చేశాడు. తమిళనాడు లో అతడి ఇల్లు ఓ దర్శనీయ ప్రదేశంలా మారిపోయింది. ఎంతో మంది ప్రముఖులు ఆ ఇంటిని చూడటానికి వచ్చేవారు. ఈ క్రమంలోనే తను ఇష్టమైన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు గోపీ కృష్ణ. ధోని వీరాభిమానిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతడి మరణం అందరిని తీవ్రంగా బాధించింది.

గోపీ కృష్ణ.. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా తిటకూడి సమీపంలోనే అరంగుర్ గ్రామానికి చెందిన వ్యక్తి. దుబాయ్ లో ఉద్యోగం చేసుకునే గోపీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇక మహేంద్రసింగ్ ధోని అంటే చచ్చేంత ప్రేమ. ఆ ప్రేమతోనే తన ఇంటిని ధోని నిలయంగా మార్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కలర్ తో పాటు ధోని ఫొటోలను తన ఇంటి గోడలపై వేయించాడు. దీంతో ఆ ఇల్లు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. గోపీ ఇల్లు చూడ్డానికి సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చాడు. ఇక ఈ విషయం ధోని వరకు వెళ్లడంతో.. మిస్టర్ కూల్ సైతం ఈ ఇంటిపై స్పందించాడు. దీంతో మరింత ప్రాచూర్యం లభించింది ఈ ఇంటికి.

ఇక గోపీ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. ప్రపంచ కప్ లాంటి మెగాటోర్నీలు ఉన్నప్పుడు కచ్చితంగా ఇండియాకు వచ్చేవాడు. క్రికెట్ అంటే, ధోని అంటే ఇంత పిచ్చి ప్రేమ ఉన్న గోపీ కృష్ణ గురువారం తెల్లవారు జామున తనకు ఇష్టమైన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గోపీ కృష్ణకు అదే ఊరికి చెందిన కొందరితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి, దాంతో కొందరు సంక్రాంతికి జరిగిన క్రీడా పోటీల్లో గోపీ పై దాడిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన గోపీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి బంధువులు పోలీసులకు వివరించారు. ఇక మృతుడు గోపీ కృష్ణకు భార్యతో పాటుగా ఇద్దరు కుమారులు, పది రోజుల క్రితమే ఓ పాప పుట్టింది. గోపీ మరణ వార్త తెలిసి స్థానికంగా ఉండే ప్రజలతో పాటుగా ధోని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.