MS Dhoni 100 Feet Massive Cutout At AP: లెజెండ్ ధోనీకి 100 ఫీట్ల భారీ కటౌట్.. ఎక్కడో కాదు, మన దగ్గరే!

MS Dhoni: లెజెండ్ ధోనీకి 100 ఫీట్ల భారీ కటౌట్.. ఎక్కడో కాదు, మన దగ్గరే!

లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీని ఆరాధించే వాళ్లు కోట్లలో ఉన్నారు.

లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీని ఆరాధించే వాళ్లు కోట్లలో ఉన్నారు.

లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీని ఆరాధించే వాళ్లు కోట్లలో ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే అయినా మహేంద్రుడి ఇమేజ్, క్రేజ్ చెక్కుచెదరలేదు సరికదా.. ఏటికేడు మరింత పెరుగుతోంది. కేవలం ధోని కోసమే ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ మ్యాచుల్ని చూసేవారు ఎంతో మంది ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన ఈ దిగ్గజ ఆటగాడు.. ఐపీఎల్​లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. గత మూడ్నాలుగేళ్లుగా రిటైర్ అవుతాడని వార్తలు వస్తున్నా ఫ్యాన్స్ అభ్యర్థనలు, టీమ్ అవసరాల మేర కొనసాగుతున్నాడు. ఫిట్​నెస్​తో పాటు అందాన్ని కూడా కాపాడుకుంటూ మరింత స్టైలిష్​గా మారిన ధోని త్వరలో పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు.

ఈ నెల జులై 7న 43వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు ధోని. దీంతో అతడి అభిమానులు ఇప్పటినుంచే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. ఆల్రెడీ టీమిండియా టీ20 వరల్డ్ కప్​ గెలిచిందన్న జోష్​లో ఉన్న ఫ్యాన్స్.. మాహీ బర్త్ డే కూడా వస్తుండటంతో మరింత భారీ సెలబ్రేషన్స్​కు సిద్ధమయ్యారు. ధోని పుట్టిన రోజు నాడు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం, క్రికెట్ కిట్లు డొనేట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మరోవైపు ప్రతి ఏడాదిలాగే మాహీకి ఈసారి కూడా భారీ కటౌట్లు దర్శనమివ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అయితే తెలుగు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో మిగతా వారి కంటే ముందంజలో ఉన్నారు. ధోని కోసం ఏకంగా 100 అడుగుల కటౌట్​ను రెడీ చేస్తున్నారు. ఏపీలో ఈ కటౌట్ కొలువుదీరనుంది.

ధోనీని విపరీతంగా ఆరాధించే వారిలో తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తెలుగు ఫ్యాన్స్ మరోమారు మాహీపై తమకు ఉన్న ప్రేమను చూపించారు. అతడి కోసం ఏకంగా 100 ఫీట్ల భారీ కటౌట్​ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని నందిగామలో ఈ కటౌట్ కొలువుదీరనుంది. మాహీ బర్త్ డేకు ఒక రోజు ముందు అంటే జులై 6వ తేదీన ఈ కటౌట్​ను ఆవిష్కరించనున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ధోని క్రేజ్​కు ఇది నిదర్శనమని అంటున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంత పాపులారిటీ కలిగిన స్పోర్ట్స్​పర్సన్ ధోని ఒక్కడేనని గర్వంతో అంటున్నారు. ఇక, నందిగామలోని ధోని అభిమానులు గతేడాది కూడా భారీ కటౌట్​ను ఏర్పాటు చేశారు. అది 77 అడుగుల కటౌట్ కాగా.. ఈసారి ఏకంగా 100 ఫీట్లది ఏర్పాటు చేయడం మరింత విశేషంగా మారింది. మరి.. ధోని కటౌట్ అంశంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments