iDreamPost
android-app
ios-app

భారత జట్టులో అతడో అద్భుతం.. అలాంటోడు మళ్లీ పుట్టడు: సెహ్వాగ్

  • Published Jul 04, 2024 | 3:24 PM Updated Updated Jul 04, 2024 | 3:24 PM

Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్​లో వెల్​కమ్​ లభించింది. ఈ తరుణంలో టీమిండియా గురించి లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Team India: టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్​లో వెల్​కమ్​ లభించింది. ఈ తరుణంలో టీమిండియా గురించి లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jul 04, 2024 | 3:24 PMUpdated Jul 04, 2024 | 3:24 PM
భారత జట్టులో అతడో అద్భుతం.. అలాంటోడు మళ్లీ పుట్టడు: సెహ్వాగ్

టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చారు. వాళ్లకు గ్రాండ్ రేంజ్​లో వెల్​కమ్​ లభించింది. రోహిత్ సేనను చూసేందుకు ఎయిర్​పోర్ట్​లో వందలాది మంది అభిమానులు గుమిగూడారు. అక్కడి నుంచి ప్లేయర్లు ఎటు వెళ్తే వాళ్లను అటు ఫాలో అవుతున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన మెన్ ఇన్ బ్లూ.. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయింది. మోడీతో కలసి భారత ఆటగాళ్లంతా బ్రేక్​ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ప్లేయర్​ను ప్రధాని ఆత్మీయంగా పలకరించారు. టీ20 వరల్డ్ కప్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మోడీ ఇంటి నుంచి ముంబై ఎయిర్​పోర్ట్​కు బయల్దేరారు ఆటగాళ్లు. ముంబైలో ఇవాళ సాయంత్రం రోడ్​ షో, ఆ తర్వాత వాంఖడేలో సన్మానం జరగనుంది.

ఈ హడావుడిని కాస్త పక్కనబెడితే.. భారత్ కప్పు అందుకోవడంలో కీలక పాత్ర వహించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరికొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా యువకులకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం, ప్రపంచ కప్ కల నెరవేరడంతో పొట్టి ఫార్మాట్​కు వాళ్లు గుడ్​బై చెప్పేశారు. అయితే ఇన్నాళ్లూ టీ20ల్లో టీమిండియాకు వాళ్లు అందించిన సేవలు, వరల్డ్ కప్​లో జట్టును నడిపించిన తీరును అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు, ఎక్స్​పర్ట్స్‌ గుర్తుచేసుకుంటున్నారు. బ్యాటింగ్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా వీళ్లిద్దరి సేవల్ని కొనియాడాడు. ముఖ్యంగా కోహ్లీ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ లాంటోడు మళ్లీ ఇండియాలో పుట్టడని అన్నాడు.

‘భారత జట్టులో విరాట్ కోహ్లీ ఓ అద్భుతం. అలాంటి ప్లేయర్ మళ్లీ ఇండియాలో పుట్టడు. ఒక బ్యాటర్​గా ఎవరైనా ఇంతకంటే ఇంకేం చేయగలరు? అతడు టీమ్ కోసం అవసరమైన టైమ్​లో పరుగులు చేశాడు. టీమిండియా ఫైనల్​లో నెగ్గి ఛాంపియన్స్​గా అవతరించింది. అతడికి హ్యాపీ ఫేర్​వెల్ లభించింది. కోహ్లీకి నా హ్యాట్సాఫ్​. అలాంటి ఆటగాళ్లను మళ్లీ ప్రొడ్యూస్ చేయడం అంటే మాటలు కాదు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో కోహ్లీనే బెస్ట్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. 2014, 2016, 2022 వరల్డ్ కప్స్​లో చాలా మ్యాచుల్లో అతడు టీమ్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడని.. ఈసారి కూడా ఫైనల్​లో సూపర్బ్ నాక్​తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నాడు. టీ20ల్లో సక్సెస్ అయినట్లే మిగతా రెండు ఫార్మాట్లలోనూ అతడు ఇలాగే విజయవంతం అవ్వాలని, హై స్టాండర్డ్స్ సెట్ చేయాలని కోరుకుంటున్నట్లు వీరూ వివరించాడు. మరి.. కోహ్లీ లాంటోడు మళ్లీ పుట్టడనే వ్యాఖ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)