Mohammed Siraj: HYDలో వరల్డ్ కప్ హీరో మహ్మద్ సిరాజ్ రోడ్ షో! ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

Mohammed Siraj: HYDలో వరల్డ్ కప్ హీరో మహ్మద్ సిరాజ్ రోడ్ షో! ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

టీ20 వరల్డ్ కప్ 2024 హీరో మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అతడి ఫ్యాన్స్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. రోడ్ షో ఎక్కడి నుంచి ఎక్కడికి జరగుతుంది? ఆ వివరాలు తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ 2024 హీరో మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అతడి ఫ్యాన్స్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. రోడ్ షో ఎక్కడి నుంచి ఎక్కడికి జరగుతుంది? ఆ వివరాలు తెలుసుకుందాం.

టీ20 ప్రపంచ కప్ గెలిచి.. స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా యోధులకు అఖండ నీరాజనాలు పలికారు అభిమానులు. ఇక ఛాంపియన్స్ ముంబై వీధుల్లో విజయోత్సవ ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. ముంబై వీధులన్నీ క్రికెట్ లవర్స్ తో నిండిపోయాయి. ఎక్కడ చూసినా జనమే.. దాంతో జన సంద్రాన్ని తలపించింది మహానగరం. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ హీరో.. హైదరాబాదీ పేస్ గన్ మహ్మద్ సిరాజ్ నేడు(జూలై 5, శుక్రవారం) హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొననున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఫ్యాన్స్ చూసుకుంటున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను ఒక్క ఓటమి లేకుండా సొంతం చేసుకుంది టీమిండియా. ఈ మెగాటోర్నీ ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇక ప్రపంచ కప్ తో ఇండియాకి వచ్చిన టీమిండియా ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు అభిమానులు. ఎయిర్ పోర్ట్ దగ్గర నుంచి వాంఖడేలో జరిగిన సన్మాన కార్యక్రమం వరకు అడుగడుగునా.. నీరాజనాలు పలికారు. ఇదిలా ఉండగా.. టీమిండియా స్టార్ బౌలర్, వరల్డ్ కప్ విన్నర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ వరల్డ్ కప్ విజయాన్ని రోడ్ షో ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నాడు. నేడు(శుక్రవారం, జూలై 5) హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించబోతున్నాడు సిరాజ్.

మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించబోతున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సహజంగానే ఆటగాళ్లకు తమ సొంత గడ్డపై ఘన స్వాగతం పలుకుతారు ఫ్యాన్స్. అందులో భాగంగా నేడు హైదరాబాద్ లో సాయంత్రం 6.30 గంటలకు మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి నుంచి ఈద్గా మైదానం వరకు సిరాజ్ రోడ్ షో ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను అభిమానులు చూసుకుంటున్నారు. ఇక తన రోడ్ షోకు అభిమానులు తరలిరావాలని సిరాజ్ సోషల్ మీడియా ద్వారా కోరాడు.

Show comments