iDreamPost

వీడియో: వాంఖడే స్టేడియంలో పిచ్చెక్కించే సీన్! చూస్తే గూస్ బంప్స్ పక్కా..

Team India players singing 'Vande Mataram': వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గ్రౌండ్ లో ఓ పిచ్చెక్కించే సీన్ జరిగింది. అది మీరు చూశారా? చూస్తే.. గూస్ బంప్స్ పక్కా. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరుకున్న టీమిండియా వీరులకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఎయిర్ పోర్ట్ లో దిగిన దగ్గరి నుంచి.. ప్రధానిని కలిసి, ముంబై విజయోత్సవ ర్యాలీ తర్వాత వాంఖడే సన్మాన కార్యక్రమం ముగిసే వరకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఇసుక వేస్తే రాలనంత జనం ముంబై వీధుల్లో, వాంఖడే స్టేడియంలో కనిపించారు. ముంబై రోడ్లన్నీ జన సంద్రంగా మారాయి. ఇదిలా ఉండగా.. స్టేడియంలో ఓ పిచ్చెక్కించే సీన్ ను మీరు చూశారా? ఆ దృశ్యం చూస్తే.. గూస్ బంప్స్ పక్కా. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తూ.. ట్రెండింగ్ లో ఉంది.

టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియ ఆటగాళ్లకు వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది బీసీసీఐ. విజయోత్సవ ర్యాలీ ముగిసిన తర్వాత స్డేడియానికి చేరుకున్న ఆటగాళ్లు వరల్డ్ కప్ తో గ్రౌండ్ మెుత్తం తిరుగుతూ.. అభిమానులకు ప్రపంచ కప్ తో అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటుగా మిగిలిన ఆటగాళ్లు ‘మా తుజే సలామ్.. వందేమాతరం’ సాంగ్ పాడుతూ.. ప్రేక్షకులను గొంతు కలపాలని సూచించారు. దాంతో స్టేడియం మెుత్తం ఒక్కసారిగా వందేమాతరం నామస్మరణతో దద్దరిల్లింది. ఈ సీన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ, అందులో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా.. ఆటగాళ్లను ఘనంగా సన్మానించింది బీసీసీఐ. ఈ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన స్పీచ్ అభిమానులు ఆకట్టుకుంది. ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు. గ్రౌండ్ మెుత్తం ఇండియా.. ఇండియా.. ఛాంపియన్స్.. ఛాంపియన్స్ అంటూ దద్దరిల్లింది. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి