భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి తనను విమర్శిస్తున్న పాకిస్థానీలకు ఇచ్చి పడేశాడు. వాళ్లు ఎంత చెప్పినా మారరంటూ సీరియస్ అయ్యాడు.
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి తనను విమర్శిస్తున్న పాకిస్థానీలకు ఇచ్చి పడేశాడు. వాళ్లు ఎంత చెప్పినా మారరంటూ సీరియస్ అయ్యాడు.
వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత్ ఓటమిని ప్లేయర్లు, ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న జట్టు.. కప్పుపై ఆశలు పెంచి ఆఖరి మెట్టు మీద బోల్తా పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు అన్ని టీమ్స్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. చివరి మ్యాచ్‌లో చేజేతులా ఓడటంతో బాధపడుతున్నారు. కనీసం పోరాడకుండా కప్పును ఆసీస్‌ను అప్పగించేసిందని ఫీలవుతున్నారు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో ఒక్కసారిగా భారత టీమ్‌లో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. జట్టులో ఒక్క లెఫ్టార్మ్ సీమర్ కూడా లేకపోవడం వీక్నెస్గా మారింది.
టీమిండియాలో బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ ఎడమచేతి వాటం ప్లేయర్లు లేరు. రవీంద్ర జడేజా రూపంలో ఒక ఆల్‌రౌండర్ ఉన్నా అతడు లోయరార్డర్‌తో కలసి బ్యాటింగ్ చేస్తాడు. టాప్, మిడిలార్డర్లో ఒక లెఫ్టాండర్ ఉంటే లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఉంటే ప్రత్యర్థి టీమ్ బౌలర్లను ఎదుర్కోవడం కాస్త ఈజీ అయ్యేది. టీమ్‌లో పేస్ ఆల్‌రౌండర్లు, పార్ట్ టైమ్ స్పిన్నర్లు లేకపోవడం మైనస్‌గా మారింది. హార్దిక్ పాండ్యాకు సరైన రీప్లేస్మెంట్ లేకపోవడం ఫైనల్లో భారత్‌ను దెబ్బతీసింది. అలాగే నాలుగైదు ఓవర్లు వేసే పార్ట్ టైమర్లు లేకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. అయితే ఈ వరల్డ్ కప్‌లో ఎన్నో పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. శుబ్‌మన్ గిల్ మంచి బ్యాటింగ్‌తో ఫ్యూచర్‌పై భరోసా ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ ఫైనల్లో ఫెయిలైనా మిగతా మ్యాచుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్‌తో టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందరికంటే ఎక్కువగా మెచ్చుకోవాల్సింది వెటరన్ పేసర్ మహ్మద్ షమి బౌలింగ్‌నే. మొదటి మూడు మ్యాచుల్లో అతడికి చోటు దక్కలేదు. కానీ గాయపడిన పాండ్యా ప్లేసులో వచ్చిన షమి చెలరేగి బౌలింగ్ చేశాడు. మెగా టోర్నీ మొత్తంలో కలిపి ఏకంగా 24 వికెట్లు తీసుకున్నాడు. షమి బౌలింగ్‌లో ఆడాలంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భయపడ్డారు. అతడి రివర్స్ స్వింగ్, సీమింగ్ డెలివరీస్‌ను ఫేస్ చేయడం ఎవరి వల్లా కాలేదు.
ఆ టీమ్, ఈ టీమ్ అని లేదు.. అన్ని జట్ల బ్యాటర్లను షమి పోయించాడు. అపోజిషన్ టీమ్ బౌలర్లు స్వింగ్ రాబట్టేందుకు ఇబ్బంది పడిన చోట.. షమి వచ్చి రివర్స్ స్వింగ్, సీమ్ బంతులు వేస్తూ బ్యాటర్లను హడలెత్తించాడు. దీంతో కొందరు పాకిస్థాన్ సీనియర్లు అతడ్ని టార్గెట్ చేసుకున్నారు. షమి తన జేబులో ఇంకో బాల్ వేసుకొని వస్తున్నాడని.. మ్యాచ్‌లో దాన్ని తీసి అసలైన బాల్‌ను దాచేస్తున్నాడంటూ అర్థం పర్థం లేని కామెంట్లు చేశారు. వాళ్లకు పాక్ లెజెండ్ వసీం అక్రమ్ గట్టిగా సమాధానం చెప్పినా వినలేదు.
పాకిస్థాన్ విమర్శలపై ఇప్పటికే ఒకసారి స్పందించిన షమి.. మరోసారి ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు. తనను విమర్శిస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు ఎంత చెప్పినా మారరంటూ సీరియస్ అయ్యాడు. ‘నేను మొదట 5 వికెట్లు తీశా. ఆ తర్వాత నాలుగు, మళ్లీ ఐదు వికెట్లు పడగొట్టా. దీంతో కొందరు పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోయారు. మేం డిఫరెంట్ బాల్స్ వాడుతున్నామని విమర్శించేందుకు వాళ్లు ప్రయత్నించారు. వసీం భాయ్ దీని గురించి వివరించారు. అలాంటి వాళ్లను చూస్తే నాకు నవ్వొస్తోంది’ అని షమి చెప్పుకొచ్చాడు. మరి.. పాక్ విమర్శలకు షమి ఇచ్చిన రిప్లయ్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తొలి టీ-20 ముందు ఆటగాళ్లకు సూర్య వార్నింగ్! కెప్టెన్ అయ్యేసరికి..!
Mohammed Shami gave a hard reply to Pakistan. 🔥 https://t.co/IYOCJ9tuOh
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2023