iDreamPost
android-app
ios-app

Mohammed Shami: మళ్లీ పాక్ పరువు తీసిన షమీ.. ఇంకోసారి నోరెత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్!

  • Published Dec 13, 2023 | 10:14 PM Updated Updated Dec 13, 2023 | 10:14 PM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Mohammed Shami: మళ్లీ పాక్ పరువు తీసిన షమీ.. ఇంకోసారి నోరెత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్!

ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. కేవలం 7 మ్యాచ్ ల్లోనే 24 వికెట్లు తీసి ఈ మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. ఇక అతడి సూపర్ ఫామ్ ను పరిగణంలోకి తీసుకున్న బీసీసీఐ షమీ పేరును భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన అర్జున అవార్డుకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షమీ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఆటగాళ్ల పరువు తీశాడు షమీ. ఆ వివరాల్లోకి వెళితే..

సాధారణంగా క్రికెట్ లో బ్యాటర్లు సెంచరీలు చేస్తే.. బౌలర్లు వికెట్లు తీస్తే, తమకు నచ్చిన రీతిలో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కాగా.. పాకిస్తాన్ కు చెందిన ఆటగాళ్లు కొందరు సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రౌండ్ లోనే నమాజ్ చేసిన సంఘటనలు మనం చూశాం. ఈ విషయాన్ని కొందరు పాక్ మాజీ క్రికెటర్లే తప్పుబట్టిన విషయం మనకు తెలియనిది కాదు. ఎవరి మతాన్ని, దేవుళ్లను వారు గౌరవించుకోవడంలో తప్పు లేదు. కానీ ఆటను ఆటలాగే చూడాలని, గేమ్ లోకి మతాన్ని తీసుకురావొద్దని వారు సూచించారు. తాజాగా ఇదే విషయంపై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మహ్మద్ షమీ మాట్లాడుతూ..”ఒక వేళ నేను గ్రౌండ్ లో నమాజ్ చేయాలనుకుంటే.. నన్ను ఎవరు ఆపగలరు? ఇక నేను గర్వంగా చెప్పుకుంటాను ముస్లింనని. అంతే గర్వంగా చెబుతాను నేను భారతీయుడినని. నేనెప్పుడూ కూడా 5 వికెట్లు తీసిన తర్వాత ప్రార్ధన చేయడం చూశారా? అలా చేయాలనుకుంటే నా కెరీర్ లో ఎన్నో సార్లు 5 వికెట్ల హాల్స్ సాధించాను” అంటూ పాక్ ఆటగాళ్ల పరువు తీస్తూ చెప్పాడు. ప్రస్తుతం ఈ స్పీడ్ గన్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్దమవుతున్నాడు. దీంతో ఈ కామెంట్స్ పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.