ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ కు ముందు ఆసీస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తలకు గాయం కావడంతో మాక్స్ వెల్ జట్టుకు దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్ అర్దాంతరంగా ఇంటికి వెళ్లాడు.
ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ కు ముందు ఆసీస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తలకు గాయం కావడంతో మాక్స్ వెల్ జట్టుకు దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్ అర్దాంతరంగా ఇంటికి వెళ్లాడు.
వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్ మాక్స్ వెల్ తలకు గాయం అవ్వడంతో.. జట్టుకు దూరమయ్యాడు. ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారిన క్రమంలో.. మరో భారీ షాక్ ఆసీస్ కు తగిలింది. వ్యక్తిగత కారణాలతో వరల్డ్ కప్ మధ్యలోనే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ప్రకటించింది. దీంతో నవంబర్ 4న ఇంగ్లాండ్ తో జరిగే కీలకపోరుకు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది.
వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడబోతోంది ఆసీస్. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్న కంగారూ టీమ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తలకు గాయం కావడంతో మాక్స్ వెల్ జట్టుకు దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్ వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటికి వెళ్లాడు.
ఆసీస్ స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తన వ్యక్తిగత కారణాలచేత ఆస్ట్రేలియాకు వెళ్లాడు. దీంతో అతడు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలిపాయి ఆసీస్ క్రికెట్ వర్గాలు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. మార్ష్ ఓపెనర్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఓ సెంచరీతో 225 పరుగులు చేసి.. డేవిడ్ వార్నర్ కు తోడుగా విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నాడు. ఇలాంటి కీలక టైమ్ లో మార్ష్ జట్టుకు దూరం కావడం ఆసీస్ కు కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకున్న స్టోయినిస్ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
Mitchell Marsh ruled out against England as he flew back to Australia for personal reasons. (Espncricinfo). pic.twitter.com/JbsiFE2xF1
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023