iDreamPost
android-app
ios-app

IPL 2024: MI vs SRH మ్యాచ్.. క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్! ఏంటంటే?

  • Published Mar 26, 2024 | 5:32 PM Updated Updated Mar 26, 2024 | 5:32 PM

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం వచ్చే ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదేంటంటే?

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం వచ్చే ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అదేంటంటే?

IPL 2024: MI vs SRH మ్యాచ్.. క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్! ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా రేపు(బుధవారం, మార్చి 27)న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరుకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. దీంతో క్రికెట్ లవర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ అభిమాన ఆటగాళ్లను దగ్గర నుంచి చూడాలని ఎంతో ఆత్రుతగా ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బస్సులు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆయా ప్లేసుల నుంచి ప్రారంభమవుతాయి. మళ్లీ తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. ఈ అవకాశాన్ని క్రికెట్ ఫ్యాన్స్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కాగా.. హైదరాబాద్ లో మెుత్తం 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. సన్ రైజర్స్ టీమ్ వరుసగా ముంబై, చెన్నై, బెంగళూరు, రాజస్తాన్, లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లతో తలపడబోతోంది. ఈ ఏడు మ్యాచ్ లు కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి. బస్సు రూట్ల వివరాలు..

ఇదికూడా చదవండి: IPL 2024: ఓటమి బాధలో ఉన్న ముంబైకి ఊహించని షాక్! స్టార్ ప్లేయర్..