iDreamPost

IPL 2024: ఓటమి బాధలో ఉన్న ముంబైకి ఊహించని షాక్! స్టార్ ప్లేయర్..

గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసి.. బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఇంకా జట్టులోకి రాలేదు. మరి దానికి కారణాలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసి.. బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఇంకా జట్టులోకి రాలేదు. మరి దానికి కారణాలు ఏంటి? తెలుసుకుందాం పదండి.

IPL 2024: ఓటమి బాధలో ఉన్న ముంబైకి ఊహించని షాక్! స్టార్ ప్లేయర్..

క్రికెట్ లవర్స్ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2024 సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. మ్యాచ్ లు చివరి వరకూ ఉత్కంఠగా సాగుతూ.. అభిమానులకు కిక్కెక్కిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా పరాజయం పొందింది ముంబై ఇండియన్స్. కాగా.. ఓటమిబాధలో ఉన్న ఎంఐ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రేపు(మార్చి 27)న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదట. మరి ఆ కీలక ఆటగాడు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ ను ముంబై ఇండియన్స్ టీమ్ ఓటమితో ఆరంభించింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయితే ఓటమిబాధలో ఉన్న పాండ్యా సేనకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఎంఐ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైయ్యాడు. అతడు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. సూర్య ఉండుంటే.. ముంబై లక్ష్యాన్ని ఈజీగా ఛేదించేంది. దీంతో సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ కైనా అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు.

కానీ సూర్యకుమార్ కు నేషనల్ క్రికెట్ అకాడమీ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రంలోగా సూర్యకు ఎన్సీఏ ఎన్ఓసీ ఇస్తేనే సరి.. లేకపోతే.. SRH మ్యాచ్ కు కూడా అతడు దూరమయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఇది ఎంఐ టీమ్ కు భారీ షాకనే చెప్పాలి. ఇప్పటికే పాండ్యా కు కెప్టెన్సీ అప్పగించడం కారణంగా జట్టులో ఆటగాళ్ల మధ్య అభిప్రాయా బేధాలు ఏర్పడ్డాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. కాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న స్కై.. ప్రస్తుతం ఎన్సీఏలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ అనుమతి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇటు సన్ రైజర్స్, అటు ముంబై టీమ్స్ తమ తమ తొలి మ్యాచ్ ల్లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి.. టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య టీమ్ లోకి ఇంకా రాకపోవడం ఎంఐకి తీరనిలోటు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPLలో BCCI మరో ప్రయోగం.. ఇక బ్యాటర్ల కష్టాలు తీరినట్లే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి